సాక్షి, న్యూఢిల్లీ : పాలక కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌లో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో జులై 5న తన కుమారుడు, కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి బడ్జెట్ ప్రవేశపెడతారని జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, జులై 5న అసెంబ్లీలో కుమారస్వామి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని, జులై 12న బడ్జెట్ సభ ఆమోదం పొందుతుందని అన్నారు.
తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, మీడియాలో మాత్రమే ఆందోళన కనిపిస్తోందని..ఇప్పుడిక సంతృప్తిగా వెనుదిరగవచ్చని దేవెగౌడ విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. బడ్జెట్ సమర్పించడంపై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అభ్యంతరాలను ప్రస్తావిస్తూ ఇక దీనిపై చర్చ అనవసరమని, జులై 5న బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పుకొచ్చారు. రక్షణ శాఖ స్థాయాసంఘ సమావేశాల్లో పాల్గొనేందుకు కమిటీ లో సభ్యుడిగా ఉన్న దేవెగౌడ ఢిల్లీలో ఉన్నారు. కాగా కుమారస్వామి సర్కార్ భవితవ్యంపై జేడీఎస్-కాంగ్రెస్ సమన్వయ కమిటీ చైర్మన్ సిద్ధరామయ్య సందేహం వ్యక్తం చేసిన వీడియో వెలుగుచూడటం ఇరు పార్టీల్లో కలకలం రేపింది.
బడ్జెట్ సహా పలు అంశాలపై కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి తెరలేపాయి. మరోవైపు సంకీర్ణ సర్కార్ ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment