hd devegowda
-
దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్..
సాక్షి, బెంగళూరు: జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు ఎంపీగా రేవణ్ణ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. అతడి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ తరఫున హసన్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ తరపున లోక్‌సభకు ఎన్నికైన ఒకే ఒక్క నేత ప్రజ్వల్. అయితే రేవణ్ణ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ఎన్నికల కమిషన్‌కు తన ఆస్తులను ప్రకటించలేదని ఆరోపిస్తూ ఆయనపై కర్ణాటక హైకోర్టు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గానికి చెందిన ఓటరు జీ దేవరాజేగౌడతోపాటు రేవర్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్ కె నటరాజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనని తేల్చింది. ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని చెప్పింది. చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా.. అంతేగాక వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అలాగే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు ప్రజ్వల్ రేవణ్ణపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం. అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మంజు పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇక లోక్‌భ ఎన్నికల్లో రేవణ్ణపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తరువాత జీడీఎస్‌లో చేరారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
Sakshi Cartoon: అర్జంటుగా కాంగ్రెస్ రక్షణకు ఏకతాటిపైకి తీసుకురావాలి సార్!
అర్జంటుగా కాంగ్రెస్ రక్షణకు ఏకతాటిపైకి తీసుకురావాలి సార్! -
దేవెగౌడపై అభ్యంతరకర వీడియో : ఇద్దరి అరెస్ట్
బెంగళూర్ : మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడతో పాటు ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తూ అభ్యంతరకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి జేడీ(ఎస్)లో కుటుంబ రాజకీయాలే కారణమని నిందించేలా ఈ వీడియోలను పోస్ట్ చేశారని చెప్పారు. జేడీ(ఎస్) నేత ఫిర్యాదుపై నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని తెలిపారు. కాగా నిందితులు ఆ పార్టీ కార్యకర్తలేనని వీరిని పెట్రోల్ పంప్లో పనిచేసే సిద్దరాజు, క్యాబ్ డ్రైవర్ చామరాజులుగా గుర్తించామని తెలిపారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై అభ్యంతరకర పోస్ట్‌లను షేర్ చేశారంటూ ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడంపై సర్వత్రా నిరసన వెల్లువెత్తింది. ఇది నెటిజన్ల స్వేచ్ఛను హరించడమేననే వాదన ముందుకొచ్చింది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను తక్షణమే విడుదల చేయాలని యూపీ పోలీసులను సుప్రీం కోర్టు ఆదేశించింది. -
‘ఏడు సీట్లలో పోటీ.. ప్రధాని పదవిపై కన్ను’
బెంగళూర్ : లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఏడు సీట్లలో పోటీ చేస్తూ దేశ ప్రధాని కావాలని జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ కలలు కంటున్నారని కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప విమర్శించారు. దేవెగౌడ కేవలం ఏడు సీట్లలోనే ప్రత్యర్ధులపై తలపడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశ ప్రధాని లేదా ప్రధాని సలహాదారు కావాలని ఆశపడుతున్నారని ఆరోపించారు. రాహుల్ ప్రధాని అయితే ఆయన పక్కన కూర్చునేందుకు తాము సిద్ధమని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీలా తాను క్రియాశీల రాజకీయాలకు దూరం కానని, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని దేవెగౌడ అన్నారు. ఎన్నికల్లో పోటీచేయనని తాను మూడేళ్ల కిందట ప్రకటించినా, తాను పోటీచేయక తప్పని పరిస్ధితి ప్రస్తుతం నెలకొందని చెప్పారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ తుంకూర్ స్ధానం నుంచి బీజేపీ అభ్యర్ధి జీఎస్ బసవరాజ్‌తో తలపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆమోదయోగ్య అభ్యర్థిగా దేవెగౌడ దేశ ప్రధాని అవుతారని ఆయన కుమారుడు, కర్నాటక సీఎం కుమారస్వామి ప్రకటనను ప్రస్తావిస్తూ ప్రధాని పదవిపై తాను ఆలోచించడం లేదని, రాహుల్ ప్రధాని అయితే ఆయన పక్కన ఉండేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. -
నేనూ ‘యాక్సిడెంటల్ ప్రధాని’నే: దేవెగౌడ
బెంగళూరు: మాజీ ప్రధాని మన్మోహన్ బయోపిక్‌పై దుమారం రేగుతున్న వేళ.. తానూ అనుకోకుండా ప్రధాని(యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్) అయ్యాయని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. తాజా వివాదంపై ఆయన స్పందిస్తూ ‘ ఈ సినిమాపై వివాదం గురించి నాకు పెద్దగా తెలీదు. ఆ మాటకు వస్తే నేను కూడా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌నే’ అని సరదాగా వ్యాఖ్యానించారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. బయటి నుంచి కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుతో దేవెగౌడను ప్రధానిగా ఎన్నుకున్నారు. కుమారస్వామి.. యాక్సిడెంటల్ సీఎం దేవెగౌడ కొడుకు, కర్ణాటక సీఎం కుమారస్వామిని బీజేపీ ‘యాక్సిడెంటల్ సీఎం’గా అభివర్ణించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కరువుతో అల్లాడుతుంటే ఆయన కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సింగపూర్‌లో పర్యటించడంపై మండిపడింది. ‘కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 377 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 156 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఇంకా రుణమాఫీ ప్రకటనను అమలుచేయలేదు. సీఎం కుమారస్వామి కొత్త సంవత్సర వేడుకల కోసం సింగపూర్ వెళ్తున్నారు. యాక్సిడెంటల్ సీఎం పేరిట సినిమా తీస్తే కుమారస్వామి పాత్రను ఎవరు పోషిస్తారు?’ అని బీజేపీ ట్వీట్ చేసింది. -
కుమారస్వామి సర్కార్‌కు ఢోకా లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : పాలక కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌లో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో జులై 5న తన కుమారుడు, కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి బడ్జెట్ ప్రవేశపెడతారని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, జులై 5న అసెంబ్లీలో కుమారస్వామి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని, జులై 12న బడ్జెట్ సభ ఆమోదం పొందుతుందని అన్నారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, మీడియాలో మాత్రమే ఆందోళన కనిపిస్తోందని..ఇప్పుడిక సంతృప్తిగా వెనుదిరగవచ్చని దేవెగౌడ విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. బడ్జెట్ సమర్పించడంపై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అభ్యంతరాలను ప్రస్తావిస్తూ ఇక దీనిపై చర్చ అనవసరమని, జులై 5న బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పుకొచ్చారు. రక్షణ శాఖ స్థాయాసంఘ సమావేశాల్లో పాల్గొనేందుకు కమిటీ లో సభ్యుడిగా ఉన్న దేవెగౌడ ఢిల్లీలో ఉన్నారు. కాగా కుమారస్వామి సర్కార్ భవితవ్యంపై జేడీఎస్-కాంగ్రెస్ సమన్వయ కమిటీ చైర్మన్ సిద్ధరామయ్య సందేహం వ్యక్తం చేసిన వీడియో వెలుగుచూడటం ఇరు పార్టీల్లో కలకలం రేపింది. బడ్జెట్ సహా పలు అంశాలపై కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి తెరలేపాయి. మరోవైపు సంకీర్ణ సర్కార్ ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర పేర్కొన్నారు. -
కర్ణాటకలోని తెలుగువారంతా ఆ పార్టీకే ఓటేయండి
-
ప్రకాశ్ రాజ్ మంచి స్నేహితుడు: కేసీఆర్
సాక్షి, బెంగళూర్ : సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తనకు మంచి స్నేహితుడని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నాం కేసీఆర్.. దేవెగౌడతో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ విలేఖరి ప్రకాశ్ రాజ్ ఎందుకొచ్చారంటూ ప్రశ్నించాడు. ఇంతలో కేసీఆర్ జోక్యం చేసుకుని... ‘ ప్రకాశ్ రాజ్ కర్ణాటకకు చెందిన వ్యక్తి. సమాజం, పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్నారు. ఆయనో హీరో. అన్నింటికి మించి నాకు మంచి స్నేహితుడు. ఆయన చేస్తున్న పోరాటానికి నా అభినందనలు’ అని కేసీఆర్ తెలిపారు. ఎవరు మోసం చేశారో గుర్తించండి ఎవరు హామీ ఇచ్చి మోసం చేశారో-ఎవరు న్యాయం చేశారో తెలుసుకోవాలని కర్ణాటక ప్రజలకు నటుడు ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కేసీఆర్-దెవెగౌడ భేటీలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఏపార్టీ ద్వారా న్యాయం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. దేశంలో ప్రస్తుత పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే మార్పు కోరుకునే ప్రజలంతా కలిసి ముందుకు రావాలి. అందులో భాగమే ఫెడరల్ ఫ్రంట్. పార్టీలన్నీ బీజేపీ-కాంగ్రెస్ ట్రాప్ నుంచి బయటపడాలి’ అని ప్రకాశ్ రాజ్ తెలిపారు. -
కర్ణాటకలోని తెలుగువారంతా ఆ పార్టీకే ఓటేయండి
సాక్షి, బెంగళూరు: మరికొద్ది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీకి మద్దతు తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఫెడరల్ ఫ్రంట్ వ్యూహ చర్చల్లో భాగంగా శుక్రవారం బెంగళూరుకు వెళ్లిన ఆయన.. మాజీ ప్రధాని, జేడీఎస్ కురువృద్ధుడు హెచ్డీ దేవేగౌడను కలుసుకున్నారు. గౌడతో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలతోపాటు కర్ణాటక-తెలంగాణల మధ్య నెలకొన్న సమస్యలపైనా కేసీఆర్ చర్చించారు. ఈ భేటీలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గౌడ, సీఎం వెంట సినీనటుడు ప్రకాశ్ రాజ్, పలువురు టీఆర్ఎస్ ముఖ్యులు పాల్గొన్నారు. పెద్దాయన హామీ ఇచ్చారు: దేవేగౌడతో భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ దేశ ప్రజల కోసమే బీజేపీ, కాంగ్రేసేతర ఫ్రంట్‌గా మేం ఏర్పడుతున్నాం. 70 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో మౌళికమైన మార్పులు రాలేదు. 70 టీఎంసీల నీరు వృధాగా పోతున్నా, 40 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నాం. పాలకుల అసమర్థత వల్లే రాష్ట్రాల మధ్య జలయుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. రైతులు, సామాన్యుల మేలు కోసమే ఫ్రంట్‌ను ఏర్పాటుచేస్తున్నాం. దానికి తన ఆశీస్సులు ఉంటాయని దేవేగౌడ గారు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతిచ్చి ఓటేయాలని కోరుతున్నా’’ అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఆలోచనలో న్యాయముంది: ‘‘స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తైనా దేశం చాలా సమస్యలను జయించలేకపోయిందన్న మాట వాస్తవం. కీలకమైన అంశాల ప్రాతిపతికన జాతీయ స్థాయిలో ఫ్రంట్ అవసరం. కేసీఆర్ ప్రయత్నాలకు మేం అండగా ఉంటాం. ఆయన కార్యాచరణ బాగుంది. మున్ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుని కలిసి నడవాలనుకుంటున్నాం’’ అని దేవేగౌడ మీడియాతో చెప్పారు. -
ప్రధాని మోదీతో మాజీ ప్రధాని భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించినప్పుడే దేవెగౌడను కూడా ప్రధాని నరేంద్ర మోదీ తన అధికార నివాసానికి ఆహ్వానించారు. అయితే అప్పట్లో బెంగళూరులో వేరే కార్యక్రమాల్లో ఉన్నందువల్ల దేవెగౌడ ఢిల్లీ రాలేకపోతున్నట్లు చెప్పారు. తర్వాత ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రావాలని దేవెగౌడకు సమాచారం అందించారు. దాంతో ఇప్పుడు.. బుధవారం నాడు ఆయన ఢిల్లీ వచ్చి, నెం.7 రేస్‌కోర్సు రోడ్డులోని ప్రధాని అధికారిక నివాసానికి వచ్చి మోదీని కలిసి ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. తెల్లటి లాల్చీ, తెల్లటి పంచె, తెల్లటి పైపంచ ధరించి వచ్చిన దేవెగౌడకు.. ప్రధాని నరేంద్రమోదీ కూడా తెల్లటి లాల్చీ పైజమా ధరించి స్వాగతం పలికారు.