బెంగళూర్ : లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఏడు సీట్లలో పోటీ చేస్తూ దేశ ప్రధాని కావాలని జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ కలలు కంటున్నారని కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప విమర్శించారు. దేవెగౌడ కేవలం ఏడు సీట్లలోనే ప్రత్యర్ధులపై తలపడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశ ప్రధాని లేదా ప్రధాని సలహాదారు కావాలని ఆశపడుతున్నారని ఆరోపించారు. రాహుల్ ప్రధాని అయితే ఆయన పక్కన కూర్చునేందుకు తాము సిద్ధమని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.
కాగా, బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీలా తాను క్రియాశీల రాజకీయాలకు దూరం కానని, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని దేవెగౌడ అన్నారు. ఎన్నికల్లో పోటీచేయనని తాను మూడేళ్ల కిందట ప్రకటించినా, తాను పోటీచేయక తప్పని పరిస్ధితి ప్రస్తుతం నెలకొందని చెప్పారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ తుంకూర్ స్ధానం నుంచి బీజేపీ అభ్యర్ధి జీఎస్ బసవరాజ్‌తో తలపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆమోదయోగ్య అభ్యర్థిగా దేవెగౌడ దేశ ప్రధాని అవుతారని ఆయన కుమారుడు, కర్నాటక సీఎం కుమారస్వామి ప్రకటనను ప్రస్తావిస్తూ ప్రధాని పదవిపై తాను ఆలోచించడం లేదని, రాహుల్ ప్రధాని అయితే ఆయన పక్కన ఉండేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment