కేసీఆర్-దేవెగౌడ-ప్రకాశ్‌రాజ్
సాక్షి, బెంగళూర్ : సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తనకు మంచి స్నేహితుడని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నాం కేసీఆర్.. దేవెగౌడతో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ విలేఖరి ప్రకాశ్ రాజ్ ఎందుకొచ్చారంటూ ప్రశ్నించాడు. ఇంతలో కేసీఆర్ జోక్యం చేసుకుని... ‘ ప్రకాశ్ రాజ్ కర్ణాటకకు చెందిన వ్యక్తి. సమాజం, పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్నారు. ఆయనో హీరో. అన్నింటికి మించి నాకు మంచి స్నేహితుడు. ఆయన చేస్తున్న పోరాటానికి నా అభినందనలు’ అని కేసీఆర్ తెలిపారు.
ఎవరు మోసం చేశారో గుర్తించండి
ఎవరు హామీ ఇచ్చి మోసం చేశారో-ఎవరు న్యాయం చేశారో తెలుసుకోవాలని కర్ణాటక ప్రజలకు నటుడు ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కేసీఆర్-దెవెగౌడ భేటీలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఏపార్టీ ద్వారా న్యాయం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. దేశంలో ప్రస్తుత పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే మార్పు కోరుకునే ప్రజలంతా కలిసి ముందుకు రావాలి. అందులో భాగమే ఫెడరల్ ఫ్రంట్. పార్టీలన్నీ బీజేపీ-కాంగ్రెస్ ట్రాప్ నుంచి బయటపడాలి’ అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment