మరికొద్ది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీకి మద్దతు తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఫెడరల్ ఫ్రంట్ వ్యూహ చర్చల్లో భాగంగా శుక్రవారం బెంగళూరుకు వెళ్లిన ఆయన.. మాజీ ప్రధాని, జేడీఎస్ కురువృద్ధుడు హెచ్‌డీ దేవేగౌడను కలుసుకున్నారు.