
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు. జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధినేత కుమారస్వామితో భేటీ కానున్నారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేని నేపథ్యంలో కేసీఆర్ ముందుగానే ఆయనను కలిసి అభినందించనున్నారు. బుధవారం పలు అత్యవసర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే బెంగళూరుకు వెళ్లడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామిని అభినందించిన వెంటనే కేసీఆర్ మళ్లీ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment