
సాక్షి, బెంగళూరు : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం బెంగళూరులో జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధినేత కుమారస్వామితో భేటీ అయ్యారు. రేపు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కుమారస్వామి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
బెంగళూరులో కేసీఆర్ నేరుగా మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్‌కు దేవేగౌడ పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేని నేపథ్యంలో కేసీఆర్ ముందుగానే ఆయనను కలిసి అభినందించారు. రేపు అత్యవసర సమావేశాల దృష్ట్యా బెంగళూరు నుంచి కేసీఆర్ ఈ రాత్రికే హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment