
కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జనతా దళ్ సెక్యులర్‌లు కలసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన చేశారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల మధ్య కేబినేట్ విస్తరణ పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 6వ తేదీన కేబినేట్‌ను విస్తరించనున్నట్లు వెల్లడించారు.
ఇరువర్గాలు ఓ ఉమ్మడి కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. దీనికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య నేతృత్వం వహించనున్నారు. ప్రతి నెలా ఒకసారి ఈ కమిటీ భేటీ అవుతుంది. మొత్తం 34 శాఖల్లో కాంగ్రెస్‌కు 22(హోం, ఇరిగేషన్, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమ తదితరాలు), జేడీఎస్‌కు 12(ఎక్సైజ్, పీడబ్ల్యూడీ, విద్య, పర్యాటకం, రవాణా తదితరాలు) దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment