ఊహ తెలిసినప్పటి నుంచే సినిమా పిచ్చి | H23 Hero Kumaraswamy Interview | Sakshi
Sakshi News home page

భయపెట్టి.. నవ్విస్తాం

Published Thu, Jan 7 2021 8:04 AM | Last Updated on Thu, Jan 7 2021 8:10 AM

H23 Hero Kumaraswamy Interview - Sakshi

హెచ్‌23 చిత్రంలో ఓ సన్నివేశంలో..

సాక్షి, మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ఆ కుర్రాడికి ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పల్లెను వదిలి.. పట్టణం బాటపట్టాడు. ఎం.కాంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి.. ఆ పట్టాను సినీ ఇండస్ట్రీలో ప్రవేశానికి అనుకూలంగా మార్చుకున్నాడు. ముందుగా సినిమా నిర్మాణ సంస్థలో అకౌంటెంట్‌గా చేరాడు. ఒక వైపు విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సినిమా రంగంపై అవగాహన పెంచుకున్నాడు. అలా సినీ ప్రముఖులతో పరిచయాలు మొదలయ్యాయి. సీన్‌ కట్‌ చేస్తే.. విశాఖ వేదికగా ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రంలో తనే హీరోగా నటించి భవిష్యత్‌కు పునాది వేసుకున్నాడు. అతనే దేవరాపల్లి మండలం మారేపల్లి గ్రామానికి చెందిన కుమారస్వామి ఎన్నేటి.. అతను నటించిన హెచ్‌ 23 చిత్రం ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అతనితో ‘సాక్షి’చిట్‌చాట్‌.

తల్లిదండ్రుల ప్రోత్సాహమే నటుడిని చేసింది నటనపై నాకున్న ఆసక్తిని చూసి నాన్న ఎన్నేటి అప్పారావు, అమ్మ రమణమ్మలు ప్రోత్సహించారు. అలా పల్లె ప్రాంతం నుంచి పట్టణానికి చేరుకున్నాను. వెండితెరపై రాణించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. ఒకవైపు పీజీ చదువుకుంటూనే లఘు చిత్రాలు తీశాను. వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి.. ఆ చిత్రాలకు వచ్చిన స్పందనను బేరీజు వేసుకున్నాను. 

సప్తగిరి బ్యానర్స్‌లో అకౌంటెండ్‌గా..  
సినిమాల నిర్మాణం, దాని వెనుక ఉన్న శ్రమ తదితర అంశాలు తెలుసుకునేందుకు సప్తగిరి బ్యానర్స్‌లో అకౌంటెండ్‌గా చేరాను. సినిమా నిర్మాణానికి కావాల్సిన అన్ని అంశాలు తెలుసుకున్నాను.  

‘వైజాగ్‌’ పాట వైరల్‌ అయింది 
విశాఖ వేదికగా 2015లో వై.వి.కె.ఎస్‌ క్రియేషన్‌ సంస్థను ఏర్పాటు చేశా. ఈ క్రియేషన్‌ కింద ‘వైజాగ్‌’పాటను చిత్రీకరించాం. విశాఖ అందాలు, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలను పాట రూపంలో వినిపించాం. మా శ్రమకు మంచి స్పందన లభించింది. యూట్యూబ్, సోషల్‌ మీడియాలో ఈ పాట వైరల్‌ అయింది. అనంతరం చిత్రలహరి వెబ్‌ సిరీస్‌ చేశా. ఈ సిరీస్‌ మూడు సీజన్లకు మంచి ఆదరణ లభించింది.  

హెచ్‌ 23తో తెరంగ్రేటం  
షార్ట్‌ ఫిల్మ్‌లకు వచ్చిన స్పందనతో హెచ్‌ 23 సినిమాను విశాఖ వేదికగా పూర్తి చేశాను. బి.టెక్‌ బాబులు ఫేం ఇమంది శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది.
 
హర్రర్, కామెడీతో..  
యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా హర్రర్‌తోపాటు కామెడీ జోడించి ఈ చిత్రాన్ని నిర్మించాం. నేను హీరోగా, మౌనరాగం ఫేం కవిత, శ్రీజ హీరోయిన్లుగా నటించాం. పలు లఘు చిత్రాల్లో ప్రతిభ చూపిన వారిని మిగిలిన పాత్రలకు ఎంపిక చేశాం. ఇదే బ్యానర్‌పై మరో రెండు చిత్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. సస్పెక్ట్‌ , జగన్నాటకం చిత్రాలకు సంబంధించి నటీనటుల ఎంపిక పూర్తి చేశాం. హెచ్‌–23 చిత్రాన్ని ఆదరించండి. చిన్న చిత్రానికి గొప్ప విజయం అందించి నన్ను ఆశీర్వదించండి అంటూ ముగించారు. (చదవండి: ఎన్టీఆర్‌ కొత్త సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement