![Baahubali Prabhakar New Movie Shooting In Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/16/Movie-News.jpg.webp?itok=cECmsZX-)
కొమ్మాది (భీమిలి): తిమ్మాపురంలో రామానాయుడు ఫిల్మ్ స్టూడియోలో, సాగర్‌నగర్ బీచ్ వద్ద బాహుబలి ప్రభాకర్ సందడి చేశారు. పీఎస్‌కే ఎంటర్‌టైన్ పతాకంపై నిర్మిస్తున్న ఊర మాస్ సినిమా షూటింగ్‌కు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. రియల్ ఎస్టేట్ మాఫియా, కిడ్నాప్, ఫైటింగ్ సన్నివేశాలను ప్రభాకర్‌పై చిత్రీకరించారు. పోతిన రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు యువన్, హీరోయిన్‌లు షాలిని, వాసంతిలు నటిస్తున్నారు. మరో నాలుగు రోజులు పాటు రామానాయుడు ఫిల్మ్ స్టూడియోలో షూటింగ్ జరుపుతామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు నిర్మాతలుగా సోము, రాజేందర్, ప్రొడక్షన్ మేనేజర్‌గా రాము వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment