
షూటింగ్ స్పాట్‌లో హీరోయిన్ స్వాతి
కొమ్మాది(భీమిలి): భీమిలి బీచ్‌రోడ్డు మంగమారిపేట తీరం వద్ద బుధవారం హీరోయిన్ కలర్స్ స్వాతి సందడి చేసింది. అందాల రాక్షసి ఫేమ్ నవీన్‌చంద్ర నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. పల్లెటూరు నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ కళాశాలకు వెళ్లే సన్నివేశాలను ఇక్కడ షూట్ చేశారు. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్వంత్ నిర్మాత.
హీరో నవీన్‌చంద్రపై చిత్రీకరిస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment