గూడూరు: మంత్రాలతో చేతబడులు చేస్తున్నారనే నెపంతో పట్టపగలే తల్లీకొడుకులను స్వయానా వారి బంధువే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘ టన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలిలా.. గూడూరు మండలం బొల్లెపల్లికి చెందిన ఆలకుంట సమ్మక్క (55), కొమురయ్య దంపతులకు కుమారుడు సమ్మయ్య (32) ఉన్నాడు. సమ్మయ్య దివ్యాంగుడు. వరంగల్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా అదే గ్రామానికి చెందిన వారికి బంధువైన శివరాత్రి కుమారస్వామి తన కుటుంబానికి హాని కలిగించేలా సమ్మయ్య, సమ్మక్క మంత్రాలు, పూజలు చేస్తున్నారని, వారి తో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఎస్సై రాణాప్రతాప్ ఇరువురినీ పిలి పించి మాట్లాడారు. మంగళవారం పెద్దల సమక్షంలో మరోసారి మాట్లాడుకుంటామని చెప్పి వెళ్లారు.
అనుకున్న ప్రకారం.. మంగళవారం సమ్మక్క కు టుంబసభ్యులు స్టేషన్‌కు వచ్చారు. ఫిర్యాదుదా రుడు కుమారస్వామి రాకపోవడంతో పోలీసులు అతనికి ఫోన్ చేయగా తనకు వేరే పని ఉందని, మ రోరోజు మాట్లాడుకుంటామని చెప్పాడు. దీంతో పోలీసులు సమ్మక్క కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లమని చెప్పారు.
పోలీసులు పిలిచినా రాకుండా.. మాటు వేసి
పోలీస్‌స్టేషన్ నుంచి సమ్మక్క కుటుంబసభ్యులు ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే కాపుకాసిన కుమారస్వామి మరోవైపు నుంచి ఆటోలో వచ్చి అ డ్డుగా పెట్టాడు. తన ఆటోలోని ఇనుపరాడ్డును తీ సుకొని అందరూ చూస్తుండగానే ముందుగా సమ్మ క్క తలపై బలంగా కొట్టాడు. ఆమె తల పగిలి కిందపడగా, భర్త కొమురయ్య ఆడ్డుకోబోగా అతన్ని కూడా రాడ్‌తో కొట్టడంతో అతని చేయి విరిగి పడి పోయాడు. వికలాంగుడైన సమ్మయ్య ఆడ్డురాగా అతని తలపై రాడ్‌తో బాదాడు. అందరూ చూస్తుండగా అక్కడికక్కడే తల్లీకొడుకులు రక్తపు మడుగు లో చనిపోయారు.
స్థానికులు, సమీప వ్యాపారస్తు లు ఘటనాస్థలంలోనే కుమారస్వామిని బంధించి పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను పోలీ సులు పోస్టుమార్టం నిమిత్తం తరలించే ప్రయత్నం చేయగా, అక్కడికి చేరుకున్న వారి కుటుంబ సభ్యు లు, బంధువులు అడ్డుకున్నారు. హత్యలకు కార ణం పోలీసులేనంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఎట్టకేలకు ఆందోళనకారులు శాంతించారు.
మృతుడు సమ్మయ్య భార్య రజిత ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడి భార్యకు అరోగ్యం బాగాలేకపోవడానికి సమ్మక్క కుటుంబం చేస్తున్న పూజలే కారణమని కొంతకాలంగా ఆ కుటుంబంపై వైరం పెంచుకున్నట్లు స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment