chetabadi
-
చేతబడి నెపంతో తల్లీకొడుకుల హత్య
గూడూరు: మంత్రాలతో చేతబడులు చేస్తున్నారనే నెపంతో పట్టపగలే తల్లీకొడుకులను స్వయానా వారి బంధువే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘ టన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలిలా.. గూడూరు మండలం బొల్లెపల్లికి చెందిన ఆలకుంట సమ్మక్క (55), కొమురయ్య దంపతులకు కుమారుడు సమ్మయ్య (32) ఉన్నాడు. సమ్మయ్య దివ్యాంగుడు. వరంగల్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన వారికి బంధువైన శివరాత్రి కుమారస్వామి తన కుటుంబానికి హాని కలిగించేలా సమ్మయ్య, సమ్మక్క మంత్రాలు, పూజలు చేస్తున్నారని, వారి తో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఎస్సై రాణాప్రతాప్ ఇరువురినీ పిలి పించి మాట్లాడారు. మంగళవారం పెద్దల సమక్షంలో మరోసారి మాట్లాడుకుంటామని చెప్పి వెళ్లారు. అనుకున్న ప్రకారం.. మంగళవారం సమ్మక్క కు టుంబసభ్యులు స్టేషన్‌కు వచ్చారు. ఫిర్యాదుదా రుడు కుమారస్వామి రాకపోవడంతో పోలీసులు అతనికి ఫోన్ చేయగా తనకు వేరే పని ఉందని, మ రోరోజు మాట్లాడుకుంటామని చెప్పాడు. దీంతో పోలీసులు సమ్మక్క కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లమని చెప్పారు. పోలీసులు పిలిచినా రాకుండా.. మాటు వేసి పోలీస్‌స్టేషన్ నుంచి సమ్మక్క కుటుంబసభ్యులు ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే కాపుకాసిన కుమారస్వామి మరోవైపు నుంచి ఆటోలో వచ్చి అ డ్డుగా పెట్టాడు. తన ఆటోలోని ఇనుపరాడ్డును తీ సుకొని అందరూ చూస్తుండగానే ముందుగా సమ్మ క్క తలపై బలంగా కొట్టాడు. ఆమె తల పగిలి కిందపడగా, భర్త కొమురయ్య ఆడ్డుకోబోగా అతన్ని కూడా రాడ్‌తో కొట్టడంతో అతని చేయి విరిగి పడి పోయాడు. వికలాంగుడైన సమ్మయ్య ఆడ్డురాగా అతని తలపై రాడ్‌తో బాదాడు. అందరూ చూస్తుండగా అక్కడికక్కడే తల్లీకొడుకులు రక్తపు మడుగు లో చనిపోయారు. స్థానికులు, సమీప వ్యాపారస్తు లు ఘటనాస్థలంలోనే కుమారస్వామిని బంధించి పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను పోలీ సులు పోస్టుమార్టం నిమిత్తం తరలించే ప్రయత్నం చేయగా, అక్కడికి చేరుకున్న వారి కుటుంబ సభ్యు లు, బంధువులు అడ్డుకున్నారు. హత్యలకు కార ణం పోలీసులేనంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఎట్టకేలకు ఆందోళనకారులు శాంతించారు. మృతుడు సమ్మయ్య భార్య రజిత ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడి భార్యకు అరోగ్యం బాగాలేకపోవడానికి సమ్మక్క కుటుంబం చేస్తున్న పూజలే కారణమని కొంతకాలంగా ఆ కుటుంబంపై వైరం పెంచుకున్నట్లు స్థానికులు తెలిపారు. -
చేతబడి: నిద్ర లేచి తలుపు తెరచి చూస్తే..
సాక్షి, మదనపల్లె టౌన్: గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటివద్ద చేతబడి చేసి భయాందోళనకు గురి చేస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. పట్టణంలోని కోటవీధికి చెందిన మురళి ఇంటి ముందు బుధవారం రాత్రి మేకులు కొట్టి ఉన్న దుస్తులతో తయారు చేసిన బొమ్మ, నిమ్మకాయలు, నాలుగు కోడిగుడ్లు, మట్టికుండను ఉంచి ఇంటిముందు కుంకుమ చల్లి వెళ్లారన్నారు. అయితే గురువారం ఉదయం బాధితుని కుటుంబీకులు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడంపై తమకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకుని మున్సిపాలిటీ సిబ్బందితో వాటిని తీసివేయించామని తెలిపారు. జరిగిన ఘటనపై బాధితుడి నుంచి వివరాలు సేకరించామన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. చదవండి: (ఆకాష్ మిర్చి: రూటే సపరేటు.. కిలో రూ.120 నుంచి రూ.140) -
గిట్టనివారు చేతబడి, మంత్రాలు చేస్తున్నారని.. మూడేళ్లలో..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): సమాజాం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సైబర్ వేగంతో ముందుకు సాగుతోంది. కొందరు తమ ప్రతిభకు పదును పెడుతూ నైపుణ్యం పెంచుకుంటున్నారు. అనేక ఆవిష్కరణలతో అబ్బురపరుస్తున్నారు. ఇదేస్థాయిలో కొందరు మూఢనమ్మకాలతో అమాయకులను అంతం చేస్తున్నారు. మంత్రాలు, చేతబడులు.. ఇలా ఏవేవో కారణాలు చూపుతూ గిట్టనివారిని చంపేస్తున్నారు. గత మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా ఇలాంటి కారణాలతో 9మందిని హత్యచేశారు. అనారోగ్యమైనా, ఆర్థిక సమస్యలు తలెత్తినా.. వాతావరణ సమతుల్యత దెబ్బతినడం, పరిసరాల అపరిశుభ్రత తదితర కారణాలతో, సీజనల్, దీర్ఘకాలిక వ్యాధులు, కరోనా తదితర వైరస్ల ఉధృతి పెరుగుతోంది. ఇందుకు సామాజిక రుగ్మతలూ తోడవుతున్నాయి. వీటిబారినపడ్డ కొందరు సమస్యకు శాస్త్రీయ పరిష్కారం వైపు దృష్టి మళ్లించకుండా.. తమకు గిట్టనివారు, అనుమానం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నారని సామాజికవేత్తలు, పోలీసులు చెబుతున్నారు. మూడేళ్లలో 9 హత్యలు.. ► జిల్లా వ్యాప్తంగా 2019 సంవత్సరంలో 14 మంది హత్యకు గురయ్యారు. ► ఇందులో చేతబడి అనుమానంతో ముగ్గురిని అంతమొందించారు. ► 2020 సంవత్సరంలో 23 హత్యలు కాగా, అందులో 4 హత్యలు చేతబడి అనుమానంతోనే చోటుచేసుకున్నాయి. ► 2021 సంవత్సరంలో 25 హత్యలు చోటుచేసుకోగా, ఇందులో చేతబడి అనుమానంతో 2హత్యలు జరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. క్షుద్రపూజలు, భూత వైద్యులు.. జిల్లాలోని మారుమూల పల్లెలతోపాటు ప్రధాన పట్టణాల్లోనూ చాలామంది సామాన్యులు భూతవైద్యులను సంప్రదిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉంది. వీరి సూచన మేరకు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు క్షుద్రపూజలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అనారోగ్యం బారిన పడినా, వైద్యం చేయించినా నయం కాకపోయినా, ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతున్నా, సామాజిక రుగ్మతలతో బాధపడుతున్నా.. వాటి పరిష్కారం కోసం కొందరు భూత వైద్యులను సంప్రదిస్తున్నారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న భూతవైద్యులు.. ధనార్జనే ధ్యేయంగా క్షుద్రపూజలు చేయిస్తున్నారు. గిట్టనివారు చేతబడి, మంత్రాలు చేస్తున్నారని నమ్మిస్తున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకుంటున్న బాధితులు.. ఆవేశానికి లోనై అమాయకులను చంపేస్తున్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో మూడేళ్లలో తొమ్మిది మంది చనిపోయారు. గత మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు హతమయ్యారు. పోలీసులు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. పరిష్కారంపై దృష్టి పెట్టాలి అనారోగ్య సమస్యలు తలెత్తితే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుతం వైద్యరంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమకోర్చుతూ ఆధునిక వైద్యం అందిస్తున్నారు. ఇలాంటి వైద్యం వైపు దృష్టి పెట్టాలి. శాస్త్రీయ పరిష్కారం కోసం ఆర్థికపరమైన, సామాజికపరమైన సమస్యలనూ అవగాహనతో సమర్థవంతంగా ఎదర్కోవాలి. అంతేకానీ, మంత్రాలు, చేతబడులు అంటూ మూఢనమ్మకాలవైపు వెళ్లొద్దు. మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. – సింధూశర్మ, ఎస్పీ చదవండి: మద్యంప్రియుల్లో ‘నయా’ జోష్ .. తాగండి.. ఊగండి..! కానీ -
వచ్చే ఏడాది వివాహం.. బామ్మర్దిని హత్య చేయించిన పోలీస్ హోంగార్డ్..
-
వచ్చే ఏడాది వివాహం.. బామ్మర్దిని హత్య చేయించిన పోలీస్ హోంగార్డ్..
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): బామ్మర్దిని హత్య చేయించిన పోలీస్ హోంగార్డ్‌తో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఫలక్‌నుమా ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాలు వెల్లడించారు. జహనుమా పయీంబాగ్కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అలియాస్ షోయబ్ (32)కు సంగారెడ్డికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వచ్చే జనవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సదరు యువతి గత నెల రోజులుగా అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ముంబైలోని ఓ బాబాను సంప్రదించారు. ఆరీఫ్ దగ్గరి బంధువులే ఆమెకు క్షుద్రపూజలు (చేతబడి) చేయించారంటూ సదరు బాబా చెప్పడంతో ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యుల ఆరీఫ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆరీఫ్ హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్న తన బావ (అక్క భర్త) మహ్మద్ సమీ మోయియుద్దీన్పై అనుమానం పెంచుకున్నాడు. అతనే తనకు కాబోయే భార్యకు చేతబడి చేయించి ఉంటాడని ఆరోపిస్తూ గొడవకు దిగాడు. తనకు కాబోయే భార్యకు నయం చేయించాలని పట్టుబట్టడంతో చేసేది లేక సమీ రూ. 50 వేలు ఇచ్చాడు. అయినా ఆరీఫ్ తరచూ డబ్బుల కోసం బావను వేధించేవాడు. దీనిని భరించలేని సమీ అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం నవాబుసాబ్కుంటకు చెందిన తన సోదరుడు మహ్మద్ అంజద్ మోయియుద్దీన్, అతడి స్నేహితులు మహ్మద్ అలీ, ఆమేర్ మహ్మద్ ఖాన్లకు కొంత డబ్బు ఇచ్చి ఆరీఫ్‌ను హత్య చేయాలని కోరాడు. ఈ నెల 13న రాత్రి ఇంటి సమీపంలో ఫోన్ మాట్లాడుతున్న ఆరీఫ్ కళ్లల్లో ఆమేర్ మహ్మద్ ఖాన్ కారం పొడి చల్లగా.....అంజద్, మహ్మద్ అలీ అతడిపై గొడ్డలి, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్, అదనపు ఇన్స్పెక్టర్ కె.ఎస్.రవికుమార్, ఎస్సై నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. -
చేతబడి పేరుతో గిరిజనుడి హత్య
కొత్తూరు: చేతబడి చేస్తున్నా డన్న నెపంతో ఓ వ్యక్తిని కొందరు దారుణంగా హతమార్చారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పుల్లగూడ గిరిజన గ్రామంలో శనివారం అర్థరాత్రి ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లగూడకు చెందిన ఊలక రమేష్ అనే వ్యక్తి పది రోజుల కిందట మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఊలక నాయకమ్మ (44) చేతబడి చేయడం వల్లే మృతి చెందాడని అనుమానించిన రమేష్ బంధువులు మరికొందరితో కలిసి నాయకమ్మను తీవ్రంగా కొట్టారు. తర్వాత ఒడిశాలోని ఓ భూతవైద్యుడిని సంప్రదించి నాయకమ్మ చేతబడి చేశాడని నిర్ధారణకు వచ్చారు. అనంతరం గ్రామానికి తిరిగివచ్చి నాయకమ్మను చంపేయాల్సిందిగా అతని కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చారు. వారు తిరస్కరించడంతో శనివారం అర్ధరాత్రి నాయకమ్మను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లకు వైరు కట్టి, శ్మశానానికి తీసుకెళ్లి కొట్టి చంపారు. ఆనవాలు దొరక్కూడదని వెంటనే మృతదేహాన్ని దహనం చేశారు. విషయం తెలుసుకున్న పాలకొండ ట్రైనీ డీఎస్పీ ఎం.శ్రీలత, సీఐ చంద్రశేఖర్‌లు ఆదివారం ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు శివకృష్ణ, గంధర్వులు, దుర్గారావు, కరువయ్య, మో హనరావు, కామకృష్ణ, చిన్నారావు, ముఖ లింగం లతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. -
చేతబడి చేస్తున్నాడని...
సాక్షి, యాదాద్రి భువనగిరి: మంత్రతంత్ర విద్యలతో చేతబడి చేస్తున్నాడన్న కారణంగా ఓ వృద్ధుడిని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన చౌటుప్పల్ మండలం తంగడిపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. చిత్రాల కిష్టయ్య(80) అనే వృద్ధుడు చేతబడి చేస్తున్నాడని గ్రామస్తుల నమ్మకం. అయితే... ఇటీవల గ్రామంలో పలువురు జబ్బుపడ్డారు. కిష్టయ్యే మంత్ర తంత్ర విద్యలతో వారిని అనారోగ్యానికి గురిచేశాడన్న అనుమానంతో గ్రామస్తులు అతడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి గ్రామాన్ని సందర్శించారు. అలాగే కిష్టయ్యపై దాడికి పాల్పడ్డ పలువురిపై కేసు నమోదు చేశారు. -
చేతబడి అనుమానంతో..
కత్తిపీటతో పొట్ట కోసుకున్న గిరిజనుడు వేలేరుపాడు మండలంలో ఘటన ఆలస్యంగా వెలుగుచూసిన వైనం జంగారెడ్డిగూడెం/వేలేరుపాడు : రాకెట్ యుగంలో కూడా మూఢ నమ్మకాలను ఇంకా గిరిజనులు వదలలేకపోతున్నారు. మూఢ నమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘటనే వేలేరుపాడు మండలంలో ఎర్రబోరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కారం వెంకటేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో నొప్పిరావడంతో భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో మూఢ నమ్మకాలకు ప్రభావితమైన వెంకటేశ్వరరావు తనకు ఎవరో చేతబడి చేయించారనే అనుమానంతో భయానికి గురయ్యాడు. కడుపులో ఎలుకలు తిరుగుతున్నట్టు, పురుగులు ఉన్నట్టు అనిపిస్తూ ఉండేదని కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అలా ఉండటానికి కారణం తనకు ఎవరో చేతబడి చేసేవారని అనుమానం మరింత పెంచుకున్నాడు. అందువల్లే కడుపులో ఎలుకలు, పురుగులు ఉన్నట్టు భావించి ఈ నెల 6న ఇంట్లో ఉన్న కత్తిపీటతో కడుపును అడ్డంగా కోసేసుకున్నాడు. ఇది గమనించిన అతని సోదరులు సతీష్, శివశంకర్‌లు హుటాహుటిన సమీపంలోని వేలేరుపాడు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం రిఫర్ చేశారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో వెంకటేశ్వరరావు చికిత్స పొందుతున్నాడు. తమ సోదరుడు వెంకటేశ్వరరావు చేతబడి అనుమానంతోనే కత్తిపీటతో కడుపును కోసేసుకున్నాడని సతీష్ వెల్లడించాడు. చికిత్స అనంతరం వెంకటేశ్వరరావు కోలుకుంటున్నాడని వారు తెలిపారు.