సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులను కలిశారు. కాగా, ఆదివారం కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి సైతం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
అయితే, కేసీఆర్-కుమారస్వామి భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో పొలిటికల్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి.. కేసీఆర్ ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో తన పార్టీని విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ఉన్న వారితో కాకుండా.. కాంగ్రెస్ కూటమితో సంబంధం ఉన్న పార్టీల నేతలనే కేసీఆర్ కలవడంలో ఉన్న లాజిక్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని మత విద్వేషాలు రెచ్చగొడతారని ఆరోపించారు. సీఎం కేసీఆర్.. బీజేపీకి అనుకూలంగా మారిపోయి యూపీఏ భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్‌కు దూరం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేతకే నా సపోర్ట్: మాజీ సీఎం కుమారస్వామి
Comments
Please login to add a commentAdd a comment