సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎమ్మెల్యేల కొను గోలు కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారించాలని టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ భారత్ జోడో పాద యాత్రను, మునుగోడు ఎన్నికలను పక్కదోవ పట్టించడానికి టీఆర్‌ఎస్, బీజేపీలు ఎమ్మె ల్యేల కొనుగోలు అంశాన్ని తెర మీదికి తెచ్చి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు.
మునుగోడులో శనివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఢిల్లీలో అమిత్ షా, రాష్ట్రంలో కేసీఆర్ కలిసి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీని ఆటలో నుంచి తప్పించే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలోనే ఈ వ్యవహారం జరి గిందనే ఆరోపణలు వస్తున్నాయని, అందుకే కేసీఆర్‌ను ఏ1గా, కేటీఆర్‌ను ఏ2గా చేర్చాల న్నారు.
ఎమ్మెల్యేలను కూడా నిందితులుగా చేర్చాలని, వారికి సంబంధం లేకపోతే ఢిల్లీ పెద్దలను ఏ1గా, సంతోష్‌జీని ఏ2గా, ఏ3గా తాంత్రికులను నిందితులుగా చేర్చి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశా రు. బయటకు వచ్చిన ఆడియో ఎడిట్ వెర్షన్ మాత్రమేనని, అసలేం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత విచారణ సంస్థలపై ఉందని, సీఎం, హోంమంత్రి, డీజీపీ ఈ అంశాలపై స్పందించి ప్రజలకు సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
డబ్బు డిమాండ్ చేసినవారిపై కేసు పెట్టరా..
ఆడియో రికార్డుల ప్రకారం పైలట్ రోహిత్ రెడ్డి వారిని డబ్బులు అడుగుతున్నారని, ఇత రులను తీసుకొస్తానని బేరం చేస్తున్నారని, డబ్బు డిమాండ్ చేసిన రోహిత్ రెడ్డిని, ఇతర ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చకుండా, డిమాండ్‌ను నేరవేరుస్తామన్న తాంత్రికులపై పెట్టిన కేసు ఎలా నిలబడుతుందని ప్రశ్నించా రు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన తాంత్రికుల ఫోన్లను సీజ్ చేసి, అత్యంత కీలకమైన నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదన్నారు.
నేరం జరిగిన ప్రదేశం నుంచి పోలీసులే ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఆ ఎమ్మెల్యేలు కనిపించడం లేదని, వారు ఎక్కడున్నారో? వారిని ఏం చేశారో చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ 8 ఏళ్లలో ఎమ్మెల్యేల కొను గోలు ద్వారా 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందన్నారు. సీఎం కేసీఆర్ 2014 నుంచి ఇప్పటి వరకు 32 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆడియో టేపుల్లోనే సంజయ్, కిషన్‌రెడ్డి పాత్రలేదని, వారు ఒట్టివారేనని వెల్లడైందని, ఇంకా ప్రమాణం చేయడం దేనికని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment