కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన మోదీ.. హైదరాబాద్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చుతామనడం హాస్యాస్పదమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రసంగంలో అధికార దాహం తప్ప తెలంగాణ హితం లేదన్నారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రం లోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 8 ఏళ్లుగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య ఫెవికాల్ బంధం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఆ రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీకి రేవంత్‌రెడ్డి 9 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు.
‘పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తూ మీరు మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం. ఆ మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. సీఎం కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజె క్టు ఏటీఎంలా మారిందని మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. సొంత పార్టీ నేతలైనా అవినీతిని సహించనన్న మీరు కాళేశ్వరం అవి నీతిని ఎలా ఉపేక్షిస్తున్నారు? ఆ ప్రాజెక్టులోని అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏమిటి? ఏ చీకటి స్నేహం ఆపుతోంది.
పసుపు బోర్డు హామీ ఏమైంది.
మీరు అధికారంలోకి రాగానే ఐటీఐఆర్‌ను రద్దు చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ ఊసేలేదు. కోచ్ ఫ్యా క్టరీ 2016లోనే మహారాష్ట్రకు తరలించారు. మీ దృష్టిలో రాష్ట్రానికి అంత అప్రాధాన్యత దేనికి? ఒడిశా నైనీ కోల్‌మైన్స్ టెం డ ర్లపై మా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసినా స్పం దన లేకపోవడానికి కారణం ఏమిటీ?
విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు అంశం అతీగతీ లేదు. ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని మీరు.. నిధులు ఇవ్వడంలేదని తెలంగాణ ప్రభు త్వం తోడుదొంగల్లా ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారని ఆశిస్తున్నానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
‘అన్ని వర్గాల సంక్షేమానికే కాంగ్రెస్ ’
సాక్షి, హైదరాబాద్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో దానిపై వివరణ ఇచ్చారు. సమాజం, సామాజిక నిర్మాణాన్ని రక్షించడానికి కాంగ్రెస్ రోజూ పోరాడుతుందన్నారు.
టీపీపీసీ అధ్యక్షునిగా తాను ఈ తత్వాన్ని నమ్ముతానని పేర్కొన్నారు. తన ప్రకటనలను వక్రీకరించడం కంటే రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ అందరి కోసం పని చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment