
ముంబై/భువనేశ్వర్ : ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతోపాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దూరంగా ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి దేవెగౌడ పంపిన ఆహ్వానాన్ని శివసేన అధినేత ఉద్ధవ్ సున్నితంగా తిరస్కరించారని ఆ పార్టీ ఎంపీ తెలిపారు. పాల్ఘార్ లోక్‌సభ స్థానానికి 28న జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ బిజీగా ఉన్నందునే బెంగళూరు వెళ్లలేకపోయారన్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కార్యక్రమానికి హాజరు కాలేదని బీజేడీ పార్టీ తెలిపింది. రాష్ట్రానికే పరిమితమయిన బీజేడీకి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో కలిసి ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించింది. అయినా, గత 18 ఏళ్లలో జరిగిన ఏ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ సీఎం నవీన్ హాజరు కాలేదని పార్టీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment