సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి శనివారం తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. జేడీఎస్- కాంగ్రెస్ కూటమి పదవుల సర్దుబాటులో భాగంగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. వీరి చేత గవర్నర్ వజూభాయి వాలా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేకాకుండా మరో 19 మంది ఎమ్మెల్యేలకు వివిధ కార్పోరేషన్లకు చైర్‌పర్సన్‌లుగా అవకాశం కల్పించిన సీఎం, మరో తొమ్మిది మందిని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు.
కాగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇద్దరు మంత్రుల(మున్సిపల్, అటవీ మంత్రిత్వ శాఖ మంత్రులు)ను పదవుల నుంచి తొలగించారు. మరోవైపు మంత్రి పదవి ఆశించి భంగపడిన కర్ణాటక మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి రాజ్‌భవన్ వద్ద నిరసనకు దిగారు.
కొత్త మంత్రులు వీరే..
1. సతీశ్ జర్కిహోలి
2. రహీమ్ ఖాన్
3. శివల్లి
4. ఎంటీబీ నాగరాజ్
5. తుకారాం
6. ఎంబీ పాటిల్
7. పరమేశ్వర్ నాయక్
8. ఆర్బీ తిమ్మాపుర్
Karnataka Governor Vajubhai Vala administers oath to new State cabinet ministers at Raj Bhavan in Bengaluru. #Karnataka pic.twitter.com/zlFhh9cE36
— ANI (@ANI) December 22, 2018
Comments
Please login to add a commentAdd a comment