బెంగళూరు : జేడీయూకు లభిస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. అందుకే తమ కుటుంబంపై మనీలాండరింగ్ ఆరోపణలు చేస్తున్నారని ఆయన బుధవారమిక్కడ ఆరోపించారు. కాగా కుమారస్వామి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆదాయపన్ను (ఐటీ) శాఖ ఇన్వెస్టిగేషన్ వింగ్‌లో ఓ ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించినట్టు ఐటీ శాఖ ధ్రువీకరించింది.
కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుటుంబసభ్యులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో దేశంలో,విదేశాల్లో కుమారస్వామి కుటుంబం వివిధ పెట్టుబడుల గురించి ఐటీశాఖ ఆరాతీసి ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పటికే ఓ కేసులో లోకాయుక్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎదుట గతవారం కుమారస్వామి విచారణకు హాజరయ్యారు.
ఆదరణ చూసి ఓర్వలేకే: కుమారస్వామి
Published Wed, May 24 2017 3:50 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
Advertisement
Advertisement