
నరేంద్ర మోదీ కాదు దేవేగౌడ..
పాట్నా: భారత తొలి ఓబీసీ ప్రధాని నరేంద్ర మోదీ కాదని హెచ్ డీ దేవేగౌడ అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. దేశానికి తొలి బీసీ ప్రధాని మోదీ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నితీష్ ఖండించారు.
'అమిత్ షా చెప్పినట్టుగా దేశానికి తొలి బీసీ ప్రధాని మోదీ కాదు దేవే గౌడ' అని నితీష్ అన్నారు. ఏ విషయంపైనైనా తగిన అవగాహన లేకపోవడం, పూర్తిగా తెలియకపోవడం ప్రమాదకరమని అమిత్ షాకు చురకలించారు. బీజేపీ నేతలు అధికారం కోసం ఏమైనా చేస్తారని, అమిత్ షా వ్యాఖ్యలు కొత్తేమీకాదని నితీష్ విమర్శించారు.