బొమ్మనహళ్లి : రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రిగా ఉన్న జి.టి. దేవెగౌడ ఉన్నత విద్యాశాఖకు చెందిన అధికారులు ఎవరు తన వద్దకు రావొద్దని ఏమైనా పనులు, ఫైళ్లు ఉంటే ముఖ్యమంత్రి వద్దకు తీసుకుని వెళ్లాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నత విద్యాశాఖకు చెందిన ఐఏఎస్ అధికారులు వచ్చి ఫైళ్లను మంత్రి జీటీ దేవేగౌడకు చూపించడానికి యత్నించగా ఆయన వారిని వెనక్కి పంపిస్తున్నారు. ప్లీజ్ దయచేసి నా వద్దకు రావద్దండి, ఫైళ్లు ఏవైనా ఉంటే మీరు నేరుగా సీఎంకు చూపించండి.. ఆయన చూస్తారు అంటూ విన్నవిస్తున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదు. తాను పెద్దగా చదువుకోలేదని, ఈ శాఖను నిర్వహించలేనని జీటీ దేవెగౌడ అసంతృప్తిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment