రంగంలోకి ‘దళపతి’ | who supports a broader selection came to devagowda | Sakshi
Sakshi News home page

రంగంలోకి ‘దళపతి’

Published Mon, Aug 31 2015 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

who supports a broader selection came to devagowda

బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె మేయర్ ఎంపికలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై చర్చించేందుకు జేడీఎస్ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ అధ్యక్షతన ఆ పార్టీకు చెందిన ముఖ్యనాయకులు వచ్చేనెల 5న సమావేశం కానున్నారు. మేయర్ ఎంపికకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ వచ్చేనెల7న వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో దేవెగౌడతో ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి, బెంగళూరుకు చెందిన జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పలువురు నాయకులు వచ్చేనెల 5న భేటీ అవుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగే ఈ సమావేశం తర్వాత ఎవరికి మద్దతు ఇవ్వనున్నారో దేవెగౌడ స్పష్టం చేసే అవకాశం ఉన్నట్లు జేడీఎస్ నాయకులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement