
బహిష్కృత ఎమ్మెల్యేలకు ప్రవేశం లేదు
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ
శివమొగ్గ : బహిష్కృత ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఇది ముగిసిపోరుున అధ్యయనమని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. శుక్రవారం శివమొగ్గ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ... ప్రస్తుతం పార్టీ నుంచి బహిష్కరింపబడిన ఎమ్మెల్యేలు జేడీఎస్ పార్టీని ఎలాగైన నామరూపం లేకుండా చేయాలని కుట్ర చేశారని, వారికి తగిన శాస్తి జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో జేడీఎస్ పార్టీ మరికొంత పుంజుకోవాల్సిన అవసరం ఉందని, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలీయమైన శక్తి ఎదుగుతుందన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సీబీఐ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. దీంతో అవినీతిలో కూరుకుపోరుున నాయకులు క్లీన్‌చిట్‌తో బయటకు వస్తున్నారని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ప్రాంతీయ పార్టీల అవసరం చాలా ఉందన్నారు. జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యమని అన్నారు. కావేరి, మహదారుు సమస్యలే దీనికి ఉదాహరణ అని దేవెగౌడ అన్నారు.