ప్రధానికి మాజీ ప్రధాని విన్నపం
Published Thu, Feb 23 2017 4:39 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కర్ణాటకలో జరగబోయే మహామస్తాభిషేక ఉత్సవాలకు రూ. 500 కోట్లు మంజూరు చేయాలని కోరారు. 12 సంవత్సరాలకోసారి జరిగే ఈ ఉత్సవాలకు కర్ణాటక ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయిస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలని ఆయన ప్రధానిని విజ్ఞప్తి చేశారు. ఉత్సవాలు జరిగే హసన్ లో తీవ్ర నీటి సమస్య ఉందని, తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని మోదికి వివరించినట్లు చెప్పారు.
ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా జనాలు వస్తారని దేవగౌడ తెలిపారు. వచ్చే ఎడాది జరిగే ఈ ఉత్సవాల్లో 57 అడుగుల గోమాతేశ్వర బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు. కాగా, ఇప్పటికే ఈ విన్నపాన్ని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తిరస్కరించారు. అయితే త్వరలో మరోసారి ఆర్థిక శాఖ మంత్రిని కలిసి నిధులు విడుదల చేయాలని కోరుతామని దేవగౌడ తెలిపారు.
Advertisement
Advertisement