
బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బాత్‌రూమ్‌లో జారి పడటంతో ఆయన కుడికాలికి గాయమైంది. తన నివాసంలో జారిపడిన దేవెగౌడను పద్మనాభ నగర్ సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా, దేవెగౌడ కాలికి అయిన గాయం చిన్నదేనని, కుడి మోకాలు బెణికిందని వైద్యులు తెలిపారు. 85 ఏళ్ల దేవెగౌడ కాలికి గాయం కావడంతో కష్టంమీద నడుస్తున్నట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment