Sushil
-
ఇది పోలీసుల హత్యే!
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలోని కర్నాల్ జిల్లా రాయ్‌పూర్ జట్టన్ గ్రామానికి చెందిన రైతు సుశీల్ కాజల్ మృతికి పోలీసులే కారణమని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల లాఠీఛార్జ్ వల్లనే రైతు సుశీల్ మరణించాడని ఆయన భార్య సుదేష్ దేవీ, తల్లి విమర్శించారు. ఆయన పోలీసులు చెబుతున్న విధంగా గుండెపోటుతో మరణించలేదని వారు వాదిస్తున్నారు. పోలీసులు, హరియాణా ప్రభుత్వం కావాలనే సుశీల్ గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించారని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాఠీచార్జ్ సందర్భంగా తగిలిన తీవ్రమైన గాయాలు, నొప్పులతో ఇంటికి చేరుకున్న సుశీల్, తల్లి తీసుకొచ్చిన పసుపు కలిపిన పాలను తాగి... తనకు ఏమీ తినాలని అనిపించట్లేదని చెప్పి పెయిన్ కిల్లర్ మాత్రలను వేసుకొని పడుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే రాత్రి నొప్పులతో బాధపడుతూ ప్రాణాలు విడిచారని ఆయన భార్య, తల్లి వివరించారు. గాయాలకు, మరణానికి సంబంధం లేదు: కర్నాల్ ఎస్పీ పునియా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 28న కర్నాల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలోలో సుశీల్ కాజల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆ ఘటనలో గాయపడ్డ రైతుల్లో సుశీల్ కాజల్ ఒకరు. అదే రోజు రాత్రి లాఠీచార్జ్‌లో తగిలిన దెబ్బలతో ఇంటికి వచ్చిన సుశీల్ తెల్లారేసరికి విగతజీవిగా మిగిలిపోయాడు. కాగా కర్నాల్ ఎస్పీ గంగారామ్ పునియా మాత్రం పోలీసులతో జరిగిన ఘర్షణలో తగిలిన గాయాలకు, అతని మరణానికి సంబంధం లేదని ప్రకటించారు. కాగా సుశీల్ స్నేహితులు, కుటుంబం, రైతు సంఘాల నాయకులు మాత్రం ఇది పోలీసుల హత్యేనని అంటున్నారు. రైతు ఉద్యమంలో చురుగ్గా: రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రైతు సుశీల్ కాజల్‌తో పాటు ఆయన తల్లి, భార్య సుదేష్ దేవి, కుమారుడు సాహిల్, కుమార్తె అన్నూ నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే రైతు ఉద్యమంలో పాల్గొన్న సమయంలో సుశీల్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతిలో ఉంది. కాగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కాని, పోలీసులు కాని తమ ఇంటికి రాలేదని, కానీ సుశీల్ మరణాన్ని గుండెపోటులా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సుశీల్‌కు 1.5 ఎకరాల భూమితో పాటు ఉన్న కొద్దిపాటి పాడి వారి జీవనాధారం అని, కుటుంబం వాటిపైనే ఆధారపడి జీవిస్తోందని గ్రామస్తులు తెలిపారు. రూ.లక్ష సాయం అందించిన ఆలిండియా కిసాన్ సంఘం రాయ్‌పూర్ జట్టన్ గ్రామంలో చనిపోయిన రైతు సుశీల్ కాజల్æ కుటుంబాన్ని ఎఐకెఎస్ ప్రతినిధి బృందం మంగళవారం పరామర్శించి రూ.లక్ష సాయం అందించింది. చెక్కును సుశీల్ భార్య సుధేష్ దేవికి ఎఐకెఎస్ కోశాధికారి పి.కృష్ణప్రసాద్ తదితరులు అందించారు. వీలైనంత త్వరగా వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కర్నాల్‌లోని బస్తారా టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. -
రీల్స్ ఆన్ వీల్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిండి.. బట్ట.. ఇల్లు. ఈ మూడింటి తర్వాత మనిషికి కావాల్సింది వినోదమే!!. అందులో ముందుండేది సినిమానే!. కాకపోతే ఈ రంగంలో పెద్ద కంపెనీలదే హవా. ఇక్కడ చిన్న కంపెనీలు రాణించాలంటే వినూత్న ఆలోచన కావాలి.పిక్చర్ టైమ్ చేసిందిదే!!. గ్రామీణ ప్రాంతాల వారికి మల్టీప్లెక్స్ సినిమా అనుభూతిని కల్పించాలనుకుంది. దీనికోసం ప్రత్యేకంగా వాహనాలకు అభివృద్ధి చేసి సినిమాలను ప్రదర్శిస్తోంది. గోవా కేంద్రంగా 2015 అక్టోబర్‌లో ప్రారంభమైన ‘పిక్చర్ టైమ్’ సేవల గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ సుశీల్ చౌధురి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం.. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో పిక్చర్ టైమ్ సేవలందిస్తున్నాం. కొత్త సినిమాల రిలీజ్ కోసం స్థానిక డిస్ట్రిబ్యూటర్లతో పాటు శోభు యార్లగడ్డ, శీతల్ భాటియా వంటి నిర్మాతలు, యశ్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్), రెడ్ చిల్లీస్ వంటి నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలో ఫాక్స్ స్టార్, డిస్నీ, సోనీ పిక్చర్స్ వంటి సంస్థలతోనూ ఒప్పందం చేసుకోనున్నాం. కార్పొరేట్ ప్రకటనలు, ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ ప్రదర్శనలు, బ్రాండింగ్, సినిమా టికెట్ల అమ్మకం వంటి మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. గత సంవత్సరం రూ.8 లక్షల టర్నోవర్‌ను నమోదు చేశాం. ప్రకటనల ధరలు డీఏవీపీ నిర్దేశించినట్లే ఉంటాయి. వచ్చే నెలాఖరుకు తెలుగు రాష్ట్రాల్లోకి... ప్రస్తుతం ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పిక్చర్ టైమ్ సేవలందిస్తోంది. ఆ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 50కి పైగా సినిమాలను ప్రదర్శించాం. రేస్–3, సంజు, బాహుబలి–2 సినిమాలు నేరుగా పిక్చర్ టైమ్‌లో రిలీజయ్యాయి. వచ్చే నెలాఖరుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంట్రీ ఇస్తాం. స్థానికంగా ఒకరిద్దరితో జట్టుకట్టాం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుతో పాటూ హిందీ సినిమాలనూ ప్రదర్శిస్తాం. 10 మొబైల్ సినిమా ట్రక్స్.. సినిమాలను ప్రదర్శించేందుకు, ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా పోర్టబుల్ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం అన్ని వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా ట్రక్‌లను ఆధునీకరిస్తాం. ఏసీ, హెచ్డీ స్క్రీన్, 5.1 డోల్బీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. థియేటర్లో 120–150 సీట్లుంటాయి. ప్రస్తుతం పిక్చర్ టైమ్‌లో 10 మొబైల్ సినిమా ట్రక్‌లున్నాయి. ట్రక్ వెలుపలి భాగంలో ఫుడ్ కోర్ట్, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ జోన్లు, వై–ఫై హాట్‌స్పాట్స్, మైక్రో ఏటీఎం వంటి ఏర్పాట్లుంటాయి. టికెట్ ధరలు రూ.30–50. ఆక్యుపెన్సీ 60% ఉంటుంది. 6 నెలల్లో రూ.100 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం 60 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరికి 3 వేల పోర్టబుల్ మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్లను ఏర్పాటు చేస్తాం. ఇటీవలే ప్రీ–సిరీస్ రౌండ్లో భాగంగా రూ.25 కోట్ల నిధులు సమీకరించాం. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీఎక్స్ పార్టనర్స్ కో–ఫౌండర్ అజయ్ రిలాన్ ఈ పెట్టుబడి పెట్టారు. వచ్చే 6 నెలల్లో మరో రౌండ్లో రూ.100 కోట్ల పెట్టుబడులు సమీకరిస్తాం. 2021 నాటికి ఎస్ఎంఈ వేదికగా ఐపీవోకి వెళ్లాలని లకి‡్ష్యంచాం. -
సుశీల్ కుటుంబాన్ని ఆదుకుంటాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మృతిచెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఎస్పీతోపాటు జిల్లా పోలీసులు సుశీల్ కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.2 లక్షలు అందించారు. ఈ చెక్కును సోమవారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో సుశీల్ భార్య, కుటుంబీకులకు డీజీపీ అందజేశారు. సుశీల్ భార్యకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక సాయం అందించిన పోలీసులను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ జితేందర్, పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, సైబరాబాద్, ఖమ్మం అధ్యక్షుడు సీహెచ్.భద్రారెడ్డి, శ్రీనివాస్, గ్రేహౌండ్స్ డీఎస్పీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సుశీల్, నర్సింగ్ వివాదాన్ని పరిష్కరించండి
డబ్ల్యుఎఫ్ఐకు ఢిల్లీ హైకోర్టు సూచన న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ మధ్య నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 74కేజీల విభాగంలో ఎవరిని గేమ్స్‌కు పంపాలనే సమస్యకు పరిష్కారం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ), సుశీల్ కలిసి తీసుకోవాలని సూచించింది. రియో ఒలింపిక్స్ సన్నాహక శిబిరంలో తన పేరు లేకపోవడం.. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్స్‌కు సమాఖ్య సుముఖంగా లేకపోవడంతో చివరి ప్రయత్నంగా సుశీల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారం దీనిపై విచారణ జరిగింది. కేంద్ర క్రీడా శాఖ, డబ్ల్యుఎఫ్ఐ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ‘సుశీల్ గతంలో దేశం గర్వించదగ్గ విజయాలు సాధించాడు. అలా అని నర్సింగ్ యాదవ్‌ను తక్కువగా చేయలేం. అతడి కృషి వల్లే దేశానికి ఒలింపిక్ బెర్త్ దక్కింది. వ్యక్తిగతంగా ఒకరికి ఇబ్బంది ఎదురైనా.. దేశాన్ని మాత్రం అత్యున్నత స్థాయిలో నిలపాలి. చివరి ప్రయత్నంగా అయితేనే మేం జోక్యం చేసుకుంటాం. ముందుగా డబ్ల్యుఎఫ్‌ఐను నిర్ణయం తీసుకోనిద్దాం’ అని జస్టిస్ మన్మోహన్ అన్నారు. మరోవైపు సుశీల్ కుమార్, డబ్ల్యుఎఫ్ఐ మధ్య నేడు సమావేశం జరగనుంది. -
నా కుమారుడు అమాయకుడు
ఇదంతా జగన్ కుట్ర: ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు రావెల సుశీల్ అమాయకుడని, ఏ తప్పూ చేయలేదని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కొంతమంది వ్యక్తుల ఒత్తిడితోనే కేసు మార్చారని పోలీసులను తప్పుపట్టారు. మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ధర్మ, న్యాయ పోరాటం చేస్తామన్నారు. తన కుమారుడు నిర్దోషిగా బయటకి వస్తాడని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న తమను ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లక్ష్యంగా చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందన్నారు. జగన్ నియంతృత్వ ధోరణి వల్లే వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారన్నారు. ప్రభుత్వంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఆయన అయోమయ స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. తమను విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న జగన్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణ మాదిగలను ప్రోత్సహిస్తున్న జగన్‌ను ప్రజలు తిరస్కరిస్తారని రావెల వ్యాఖ్యానించారు. ఖబడ్దార్ జగన్! నీ ఆటలు సాగనివ్వం.. ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. సుశీల్ నిర్దోషిగా బయటకు వస్తాడు ‘‘నా కుమారుడు సుశీల్ నిర్దోషి. అతడిపై తప్పుడు కేసులు బనాయించారు. రాజకీయంగా ఎదుర్కోలేక నా కుమారుడి జీవితంతో ఆడుకుంటున్నారు. సుశీల్‌ను లేనిపోని కేసుల్లో ఇరికించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దళిత విద్యార్థి జీవితంతో ఆడుకునే నీచ రాజకీయాలకు దిగజారుతున్నారు. ఓ యువతిని వేధించారంటూ.. వేరే వీడియో పుటేజీ తీసుకొచ్చి నా కుమారుడు తప్పుచేసినట్లు చిత్రీకరిస్తున్నారు. మొదటి ఎఫ్ఐఆర్లో నా కుమారుడి పేరు లేదు. తర్వాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడని మాత్రమే ఫిర్యాదులో ఉంది. వీడియో పుటేజీని మార్ఫింగ్ చేసి నా కుమారుడిని కేసులో ఇరికించారు. ఈ విషయంలో మీడియా ద్వారా జగన్ మైండ్‌గేమ్ ఆడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టించడానికి వైఎస్సార్సీపీ కుట్ర చేసింది. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. ఈ కేసు నుంచి సుశీల్ నిర్దోషిగా బయటకు వస్తాడు’’ అని మంత్రి రావెల స్పష్టం చేశారు. మీడియా వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. -
మంత్రి రావెల రాజీనామా చేయాలి
పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల విజయవాడ(వన్‌టౌన్) : మైనార్టీ మహిళపై అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు సుశీల్‌ను కఠినంగా శిక్షించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసకుమార్ డిమాండ్ చేశారు. అలాగే తన కుమారుడిని ప్రోత్సహించి మహిళలపై ఏమాత్రం గౌరవం లేని రావెల తక్షణం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ మేరకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పంజా సెంటర్లో ఆదివారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ రావెల సుశీల్ పట్టపగలు మహిళపై అఘాయిత్యానికి పాల్పడటం అత్యంత దుర్మార్గమన్నారు. సుశీల్‌ను ఆ విధంగా పెంచిన మంత్రి బలమైన సాక్ష్యాలు ఉన్నా ఇంకా తన కుమారుడు నిర్దోషి అనడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇటీవల రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసి పేదల పొట్టలు కొట్టిన మంత్రి దానినీ సమర్ధించుకున్నారని గుర్తు చేశారు. పీసీసీ మైనార్టీ నేతలు బషీర్ అహ్మద్, అన్వర్, హుస్సేన్ పాల్గొన్నారు. -
అడ్డంగా దొరికినా విపక్షంపై ఆరోపణలా?
మంత్రి రావెలపై వైఎస్సార్సీపీ నేత అంబటి ధ్వజం కేసు వెనుక జగన్ ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తారా అని ఆగ్రహం చెరుకుపల్లి: మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఓ మహిళపై కీచకపర్వాన్ని సృష్టించిన ఫుటేజ్‌లను పలు చానళ్లలో ప్రసారం చేసినా.. మంత్రి మాత్రం ఇదంతా ప్రతిపక్ష నాయకుల కుట్రని బుకాయించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన ఆదివారం గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు సుశీల్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ప్రకటించినా.. దాని వెనుక విపక్ష నేత జగన్ఉన్నారని మంత్రి రావెల తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు. తునిలో నిర్వహించిన కాపుగర్జనలో గొడవ జరిగితే... , రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో భూములివ్వని రైతుల పంటల్ని తగులబెట్టించిన విషయంలోనూ జగనే ఉన్నారంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణమాదిగ దీక్షల వెనుక జగనే ఉన్నారంటూ ఆరోపణలు చేయడాన్ని ఇకనైనా మానుకోవాలని ఆయన అధికారపక్షానికి హితవు పలికారు. రావెలను తప్పించాలి చంద్రబాబు డెరైక్షన్‌లో మంత్రులు నడుస్తూ.. ముస్లిం మహిళ చేయి పట్టుకుని లాగిన మంత్రి రావెల తనయుడు సుశీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని అంబటి దుయ్యబట్టారు. చంద్రబాబుకు విలువలుంటే రావెలను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. -
‘రావెల సుశీల్‌ను శిక్షించాలి’
బంజారాహిల్స్: మహిళా టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్‌ను తక్షణం అరెస్టు చేయాలంటూ బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బాధితురాలు ఫాతిమా బేగంతో కలిసి ఆమె శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఇంతదాకా నిందితుడిని అరెస్టు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. సీసీ పుటేజీల్లో రావెల సుశీల్ ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ వ్యవహారంలో నిందితుడిని అరెస్టు చేసేదాకా ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
నాడు బంగారు పతకం..నేడు చీపురు
కోల్‌కతా: అతను 1987లో ఆల్ ఇండియా ఇన్విటేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నవాడు. మరిపుడు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, తన ఇద్దరు బిడ్డల్ని చదివించుకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. చివరికి హౌరా మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. 'నా సోదరుడు టీబీతో బాధపడుతున్నాడు. అతని చికిత్సకోసం డబ్బుల్లేవు. కనీసం తినడానికి తిండి కూడా లేదు' అని అంటున్న ఈ మాజీ బాక్సర్ మాటలు వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. వివరాల్లోకి వెళితే హౌరాకు చెందిన క్రిష్ణ రౌత్ 15ఏళ్ల వయసులో బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇపుడు 43 ఏళ్ల వయసులో రోజుకు 200 రూపాయల కోసం మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మురికివాడలో పూరిగుడిసెలో చాలా దయనీయమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి బాక్సింగ్ అంటే ప్రాణం. అందుకే ఇప్పటికీ దాదాపు నలభైయాభై మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. రోజుకు కనీసం రెండు గంటలువారి కోసం కేటాయిస్తాడు. ప్రభుత్వం సాయం అందిస్తే కామన్ వెల్త్ క్రీడల్లోనూ, ఒలింపిక్స్ లోనూ సత్తా చాటుతామంటున్నాడు. మరోవైపు అతని దగ్గర శిక్షణ తీసుకున్న చాలామంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించారు. 'నేను బంగారు పతకాన్ని గెలుచుకున్నపుడు చాలామంది చాలా వాగ్దానాలు చేశారు. కానీ ఏవీ అమలుకు నోచుకోలేదు. ఇది నన్ను చాలా బాధించింది. నన్ను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎపుడూ కలవడానికి ప్రయత్నించలేదు. ఎలాకలుస్తాను..వారి చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు. కనీసం మేయర్‌ను కూడా నేను కలవలేకపోయాను. తనకు శాశ్వతమైన జీవనభృతి కల్పిస్తే తన పిల్లల్ని బాగా చదివించుకుంటా' అని అంటున్నారు ఈ మాజీ ఛాంపియన్. అయితే ఈ విషయం మీడియాలో బాగా ప్రచారం కావడంతో రెజ్జింగ్ లెజెండ్, ఒలింపిక్స్ పతకాల విజేత సుశీల్ కుమార్ స్పందించారు. తను సీఎం మమతతో మాట్లాడి కృష్ణకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తానన్నారు. మమత దీదీకి క్రీడలన్నా, క్రీడాకారులన్నా చాలా అభిమానమని, ఆమె రైల్వే మంత్రిగా ఉన్నపుడు కూడా చాలామందికి సహాయం చేశారని తెలిపారు. ఇలాంటి క్రీడాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
‘ఉప్హార్’ కేసులో అన్సల్ సోదరులు దోషులే!
న్యూఢిల్లీ: ఉప్హార్ థియేటర్లో 1997లో అగ్నిప్రమాదం జరిగి 59 మంది మరణించిన ఘటనకు దాని యజమానులు, సుశీల్, గోపాల్ అన్సల్ సోదరులే బాధ్యులని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ప్రేక్షకుల భద్రత కంటే డబ్బు సంపాదనే వీరికి ముఖ్యమైనదని అభిప్రాయపడింది. అయితే దిగువకోర్టు వీరికి విధించిన శిక్షను ద్విసభ్య ధర్మాసనం ధ్రువీకరించలేదు. ఎంతకాలం శిక్ష విధించాలనే విషయమై నిర్ణయం తీసుకునే బాధ్యతను త్రిసభ్య బెంచ్‌కు అప్పగించింది. ఇది వరకే హైకోర్టు వీరికి విధించిన ఏడాది శిక్షను కొనసాగించాలని న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ఆదేశించారు. సుశీల్ వయసును దృష్టిలో ఉంచుకొని శిక్షను తగ్గించగా, గోపాల్‌కు మాత్రం రెండేళ్ల శిక్ష విదించారు. ట్రామా సెంటర్, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు రూ.100 కోట్లు చెల్లించాలని కూడా హైకోర్టు వీరిని ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ, ఉప్హార్ అగ్నిప్రమాద బాధితుల సంఘం, అన్సల్ సోదరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు పైతీర్పు చెప్పింది. డీవీబీ ట్రాన్స్ఫార్మర్ వైఫల్యం వల్ల అగ్నిప్రమాదం జరిగినందున తమకు శిక్ష విధించడం సరికాదన్న అన్సల్ సోదరుల వాదనను కోర్టు తిరస్కరించింది. చట్టాల్లో లోపాల వల్లే అన్సల్ వంటి వాళ్లు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలతో ఏకీభవించింది. ఈ సందర్భంగా సీబీఐ స్పందిస్తూ ఢిల్లీ హైకోర్టు శిక్షల ఖరారులో తప్పుడు పద్ధతిని అనుసరించిందని వాదించింది. శిక్ష తగ్గింపు సరికాదని పేర్కొంది. దోషులపై 304 (హత్యగా పరిగణించలేని శిక్షార్హమైన నరహత్య), 304 ఏ (నిర్లక్ష్యపూరిత చర్యలతో మరణానికి కారకులు కావడం) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయినందున శిక్షాకాలాన్ని పెంచాలని కోరింది. ఏవీయూటీ కూడా ఇదే తరహా విజ్ఞప్తి చేసింది.