-ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.20 కోట్లు
- రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు
మడకశిర(అనంతపురం జిల్లా): రాష్ట్రంలో 20 రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. ఆయన మంగళవారం అనంతపురం జిల్లా మడకశిరలో విలేకరులతో మాట్లాడారు. ఒక్కో రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకు రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. నాబార్డు కింద 8, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 12 రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వేరుశనగ పంటను రక్షక తడుల ద్వారా కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఉపయోగించే రెయిన్‌గన్లు, పైపులు, ఇంజన్లు, స్ప్రింక్లర్లు పక్కదారి పడితే బాధ్యులైన అధికారులపై గంటలోపే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు.
రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు
Published Tue, Aug 30 2016 8:28 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement