అనంతపురం రూరల్: అనంతపునరం జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల కళాశాలల్లో ఇంటర్ మీడియట్ ప్రవేశం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాలురుకు కాళసముద్రం, మలుగూరు, కణేకల్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులకు ఒక్కోక్క కళాశాలలో 80 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. బాలికలకు కురుగుంట కళాశాలలో సీఈసీ గ్రూప్‌కు 80సీట్లు, తిమ్మాపురం ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు 80 సీట్లు, నల్లమాడ సీఈసీ, ఎఛ్‌ఈసీ గ్రూప్‌లకు 80 సీట్లు, హిందూపురం, అమరాపురం, గుత్తి కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లకు మాత్రమే ఒక్కోక్క కళాశాలకు 80 సీట్లు కేటాయించారు. బ్రహ్మసముద్రం, ఉరవకొండ కళాశాలల్లో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌లకు 80 సీట్లు కేటాయించారని ఆమె తెలిపారు. ఎస్సీలకు 75 శాతం, కన్వర్‌టెడ్ క్రిస్టియన్ 12 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 5 శాతం, ఓసీలకు 2 శాతం రిజర్వేషన్లు కేటాయించారన్నారు. మరింత సమాచారం కోసం www.apswreis.cgg.gov.in సంప్రదించాలని పేర్కొన్నారు.
గురుకుల కళాశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published Fri, May 13 2016 5:14 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement