residential college
-
రెసిడెన్షియల్ కాలేజీలో 75 మందికి కరోనా
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 75 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. పాజిటివ్ వచ్చిన వారిలో 67 మంది విద్యార్థినులు కళాశాలలో కొత్తగా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరిన వారే కావడం గమనార్హం. పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్‌లు రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ, సోషల్ వేల్పేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల అధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తమ పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలుసుకుని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. (టీకాకూ ఓ లెక్కుంది..) కళాశాలలో 730 సీట్లు ఉండగా ప్రథమ సంవత్సరం విద్యార్థినులు నెల రోజులుగా ఇక్కడ తరగతులకు హాజరవుతున్నారు. శనివారం ఈ కళాశాలలో వైద్యాధికారులు సుమారు 283 మంది విద్యార్థినులు, 12 మంది అధ్యాపకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 67 మంది విద్యార్థినులు, మరో 8 మంది అధ్యాపకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై డీఎంహెచ్‌వో శ్రీధర్, కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌ల అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. (అందరికీ కరోనా వ్యాక్సిన్) -
ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
పినపాక(భద్రాద్రి కొత్తగూడెం): పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్ అయోమయంగా మారింది. భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఎల్చి రెడ్డిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల కేంద్రం రూం నంబర్1లో 20 మంది విద్యార్థులు శనివారం తెలుగు పేపర్–2 పరీక్ష రాశారు. ఆ గదిలోని ఇన్విజిలేటర్ విద్యార్థులకు మెయిన్ బుక్‌లెట్‌కు బదులు అదనపు సమాధాన పత్రాలు ఇచ్చాడు. కంగారులో ఉన్న విద్యార్థులు వెంటనే వాటిపై ఉన్న నంబర్‌నే ఓఎంఆర్ షీట్ మీద వేశారు. గంట తర్వాత విద్యార్థులు అడిషినల్ షీట్ అడిగారు. అప్పుడు అసలు తన టేబుల్ మీద మెయిన్ బుక్లెట్సే లేవన్న విషయం గమనిం చిన ఇన్విజిలేటర్ అధికారులకు తెలిపారు. సుమారు గంట తర్వాత విద్యార్థులకు మెయిన్ బుక్లెట్ ఇచ్చారు. ఇన్విజిలేటర్‌ను పరీక్షల విధుల నుంచి తొలగించా మని పరీక్ష కేంద్రం చీఫ్ సూప రింటెండెంట్ నాగశ్రీ తెలిపారు. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి
రాజోలు: తూర్పుగోదావరి జిల్లాలో గురుకుల కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజోలు మండలం శివకోడు గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న గోడా రాణి(16) అనే విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందింది. గోడారాణి మృతిపై అనుమానాలు రేకెత్తడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని స్వస్థలం అమలాపురం మండలం భట్నవిల్లి. -
రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు
-ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.20 కోట్లు - రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మడకశిర(అనంతపురం జిల్లా): రాష్ట్రంలో 20 రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. ఆయన మంగళవారం అనంతపురం జిల్లా మడకశిరలో విలేకరులతో మాట్లాడారు. ఒక్కో రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుకు రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. నాబార్డు కింద 8, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 12 రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వేరుశనగ పంటను రక్షక తడుల ద్వారా కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఉపయోగించే రెయిన్గన్లు, పైపులు, ఇంజన్లు, స్ప్రింక్లర్లు పక్కదారి పడితే బాధ్యులైన అధికారులపై గంటలోపే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. -
కొత్త గురుకులాలకు ఓకే
103 ఎస్సీ గురుకులాలు, 30 మహిళా రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుకు ఉత్తర్వులు ♦ పాలనాపరమైన మంజూరుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ప్రారంభించనున్న కొత్త ఎస్సీ గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా 103 ఎస్సీ గురుకుల పాఠశాలలు(బాలురు, బాలికలు), 30 ఎస్సీ మహిళా రెసిడెన్షి యల్ డిగ్రీ కాలేజీలకు పాలనాపరమైన మం జూరునిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మార్గదర్శకాలను కూడా పొందుపరిచింది. ప్రవేశాల సరళి, రిజర్వేషన్ల విధానం, కావాల్సిన బడ్జెట్, ఏయే జిల్లాల్లో ఎన్ని పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారన్న అంశాలపై స్పష్టతనిచ్చింది. ఇప్పటికే 134 విద్యాసంస్థలను విజ యవంతంగా నడిపిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలోనే కొత్త గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీలను నిర్వహించనున్నట్లు పేర్కొం ది. ఈ మేరకు జూన్ 2న ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బి.మహేదత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా అణగారిన వర్గాల కోసం ఈ విద్యాసంస్థల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రవేశాలు ఇలా... ముందుగా 2016-17లో ఒక్కో పాఠశాలలో 5, 6, 7 తరగతుల్లో (రెండు సెక్షన్ల చొప్పున), ఒక్కో క్లాసులో 40మంది చొప్పున 240మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. మొత్తం 103 స్కూళ్లు కలుపుకుని 24,720 మందికి ప్రవేశం ఉంటుంది. 2017-18 నుంచి ఒక్కో క్లాస్ అంటే 8వ తరగతి, ఆ తర్వాతి ఏడాది 9వ తరగతి, ఆ తర్వాత 10, ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 2019-20 నాటికి ఈ విద్యార్థుల సంఖ్య 65,920 కు చేరుకుంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ల అమలు ఇలా... ఈ పాఠశాలల్లో ఎస్సీలకు 75 శాతం, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు 2 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 12 శాతం, మైనారిటీలకు 3 శాతం, ఓసీ/ఈబీసీలకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. గురుకులాల్లో కేటరింగ్ సర్వీసెస్, ఊడ్వడం, శానిటేషన్, సెక్యూరిటీ సర్వీసులను ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటారు. 103 రెసిడెన్షియల్ స్కూళ్లకు జీతాలు, భవనాల అద్దెలు, విద్యార్థుల ఖర్చులు, మెయింటెనెన్స్, సివిల్ వర్క్స్, మౌలిక సదుపాయాల కోసం 2016-17లో రూ.605కోట్లు, ఆ తర్వా త మూడేళ్లకు కలుపుకుని రూ.3,090 కోట్లు ఖర్చు అవుతుందనేది అధికారుల అంచనా. రెసిడెన్షియల్ పద్ధతిలో డిగ్రీ కాలేజీలు ఎస్సీ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటికే 116 విద్యాసంస్థలను ఇంటర్మీడియట్ కోసం అప్‌గ్రేడ్ చేశారు. వీటిల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, కొన్ని వొకేషనల్ కోర్సులను ప్రతి ఏడాది 9 వేల మంది విద్యార్థులు పూర్తి చేసుకుంటున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో చదివించేందుకు పేద తల్లితండ్రులకు ఆర్థికస్థోమత లేకపోవడంతో వారు డిగ్రీ కోర్సులు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం ఎస్సీ డిగ్రీ కాలేజీలను పూర్తి రెసిడెన్షియల్ పద్ధతిలో ఉచిత వసతి, భోజనం, ఇతర వసతులు కల్పిస్తూ నిర్వహించనున్నారు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థినుల చొప్పున 7 కోర్సులను ప్రారంభించాలని ప్రతిపాదించారు. బీఎస్సీ(ఎంపీసీ), బీఎస్సీ(ఎంఎస్సీఎస్), బీఎస్సీ(బీజెడ్సీ), బీఎస్సీ(జెడ్ఎంసీ), బీఏ (హెచ్ఈపీ), బి.కాం(జనరల్), బి.కాం (కంప్యూటర్స్) కోర్సుల్లో 2016-17లో ఒక్కో కాలేజీలో 280 మంది చొప్పున 30 కాలేజీల్లో 8,400 మందికి ప్రవేశం కల్పిస్తారు. 2017-18లో 16,800 మంది, 2018-19 నాటికి మొత్తం విద్యార్థినుల సంఖ్య 25,200కు చేరుకుంటుందని వివరించారు. ఈ కాలేజీల కోసం జీతాలు, ఇతర అంశాలను కలుపుకుని 2016-17లో రూ.258.54 కోట్లు, 2017-19 లకు దాదాపు రూ.1118.10 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎస్సీ గురుకుల పాఠశాలలివే... రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో బాలికలకు 57,బాలురకు46ఎస్సీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. -
గురుకుల కళాశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం రూరల్: అనంతపునరం జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల కళాశాలల్లో ఇంటర్ మీడియట్ ప్రవేశం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాలురుకు కాళసముద్రం, మలుగూరు, కణేకల్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులకు ఒక్కోక్క కళాశాలలో 80 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. బాలికలకు కురుగుంట కళాశాలలో సీఈసీ గ్రూప్‌కు 80సీట్లు, తిమ్మాపురం ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు 80 సీట్లు, నల్లమాడ సీఈసీ, ఎఛ్‌ఈసీ గ్రూప్‌లకు 80 సీట్లు, హిందూపురం, అమరాపురం, గుత్తి కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లకు మాత్రమే ఒక్కోక్క కళాశాలకు 80 సీట్లు కేటాయించారు. బ్రహ్మసముద్రం, ఉరవకొండ కళాశాలల్లో సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్‌లకు 80 సీట్లు కేటాయించారని ఆమె తెలిపారు. ఎస్సీలకు 75 శాతం, కన్వర్టెడ్ క్రిస్టియన్ 12 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 5 శాతం, ఓసీలకు 2 శాతం రిజర్వేషన్లు కేటాయించారన్నారు. మరింత సమాచారం కోసం www.apswreis.cgg.gov.in సంప్రదించాలని పేర్కొన్నారు. -
బాలికలదే పైచేయి
► ఇంటర్ ప్రథమలో 6 వ స్థానం, ద్వితీయలో 8 ► ‘ప్రతిభ’కు స్టేట్ ర్యాంకులు ► మే 24న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు: ఆర్ఐఓ సీతారాములు మహబూబ్‌నగర్ విద్యావిభాగం: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోనూ బాలికలే పైచేసిసాధించారు. తొలిసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు ఒకే సారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లోగతేడాది 45 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 44 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరఫలితాలలో గతేడాది 52 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 9వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 55 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 8 స్థానం సాధించింది. ఇంటర్ జనరల్ ఫస్టియర్.. జిల్లా వ్యాప్తంగా 31,502 మంది పరీక్షలు రాయగా 13,912 మంది.. 44 శాతం ఉత్తీర్ణులయ్యారు. 15,985 మంది బాలురలో 6,273 మంది (39 శాతం), 15,517 మంది బాలికల్లో 7,639 మంది (49 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ జనరల్ సెకండియర్ జిల్లా వ్యాప్తంగా 29,193 మంది హాజరు కాగా 16,178 మంది విద్యార్థులు.. 55శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 14,952 మంది బాలురకు 7.661 మంది (51 శాతం), 14,241 మంది బాలికలకు 8.517 మంది (60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. వొకేషనల్‌లో.. ప్రథమ సంవత్సరానికి 3,879 మంది హాజరు కాగా 1,763 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయకు 29,193 మంది హాజరు కాగా 16,178 మంది (55 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మాడల్స్కూళ్లలో.. జిల్లాలోని ఏడు మోడల్ స్కూళ్లలో 262 బాలబాలికలు ఫస్టియర్ రాయగా 148 మంది (56 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 245 మంది సెకండియర్ రాయగా 143 మంది (58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 8,681 మంది హాజరు కాగా 4,026 మంది (46 శాతం), సెకండియర్‌కు 7,048 మంది హాజరు కాగా 4,753 మంది (67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ విభాగంలో ప్రథమకు 1284కి 946 మంది (74 శాతం), ద్వితీయకు 1,105 మంది హాజరు కాగా 896 మంది (81శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కళాశాలల్లో 42 శాతమే.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 21,021 మంది విద్యార్థులు హాజరు కాగా 8,807 మంది విద్యార్థులు (42 శాతం), ద్వితీయకు 20,520 మంది హాజరు కాగా 10,453 మంది (51శాతం) ఉత్తీర్ణులయ్యారు. గురుకుల విద్యాలయాలలో.. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ప్రథమ సంవత్సర పరీక్షలు 911 మంది రాయగా 578 మంది (63శాతం) ద్వితీయ 857 మందికి 618 మంది (72శాతం) ఉత్తీర్ణులయ్యారు. సత్తాచాటిన జిల్లా విద్యార్థులు.. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫ లితాలలో జిల్లా విద్యార్థులు తమ సత్తా చాటారు. ప్రథమసంవత్సరంలో జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థా యి ర్యాంకులు సాధించారు. ఎంపీసీలో 470కి 465 మార్కులు ముగ్గురు విద్యార్థులు జీ అఖిల్, కే సాయిలక్ష్మి, ఎం నవీన్‌సాగర్ సాధించి జిల్లా ప్రథమ స్థానం పొందారు. ప్రథమ సంవత్సర బైపీసీ విభాగంలో 440కి 436 మార్కులతో ఆసిమామహీన్ జిల్లా ప్రథమ, రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. ద్వితీయ సంత్సర ఎంపీసీలో వనపర్తి సీవిరామన్ విద్యార్థిని జి. సౌమ్య 990 మార్కులతో జిల్లా మొదటి స్థానంలో నిలవగా, జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థిని విశాలి 989 మార్కులు సాధించి జిల్లా ద్వితీయస్థానంలో నిలిచింది. ఎంఈసీ విభాగంలో షాద్‌నగర్ విజ్ఞాన్ కళాశాల ద్వితీయ విద్యార్థి సాయికుమార్ 985 మార్కులతో స్టేట్‌ఫస్ట్ ర్యాంకు సాధించాడు. జిల్లా కేంద్రంలోని జలయం జూనియర్ కళాశాల విద్యార్థిని శశిప్రియ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంఈసీ విభాగంలో 482 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానం సాధించింది. సీఈసీ విభాగంలో ద్వితీయ సంవత్సరంలో 964 మార్కులతో విజ్ఞాన్ కళాశాల విద్యార్థిని జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రణాళికా బద్ధంగా చదవడంతో.. పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడంతో పాటు ప్రణాళికాబద్ధంగా చదవడంతో ఇంటర్ జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి 465 మార్కులు సాధించి జిల్లాప్రథమ స్థానం సాధించాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లనే అధిక మార్కులు సాధించాం. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడమే లక్ష్యం. -జి. అఖిల్, ఎం. నవీన్‌సాగర్, సాయిలక్ష్మి, ఇంటర్ ఫస్టియర్ ఎంపిసీ జిల్లా ప్రథమ ర్యాంకర్లు అధ్యాపకుల ప్రోత్సాహంతోనే.. అధ్యాపకులు, తల్లిదండ్రుల పోత్సాహంతోనే జిల్లా ద్వితీయ స్థానం సాధించాను. అధ్యాపకులు చెప్పిన పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవడం వల్లనే ఎంపీసీ విభాగంలో 989 పొందాను. ట్రిపుల్‌ఈలో ర్యాంకే లక్ష్యం. కళాశాలకు రెగ్యులర్‌గా రావడంతో పాటు, పాఠ్యపుస్తకాలు చదవాలి. - బి. విశాలి, ఇంటర్ సీనియర్ ఎంపీసీ జిల్లా రెండో ర్యాంకర్, ప్రతిభ కళాశాల సీఏ లక్ష్యం.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంఈసీలో 482 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. నాన్న మనోహర్‌గౌడ్ ప్రొత్సాహం, అధ్యాపకుల సహకారం ఉంది. ప్రతి రోజు ఆరుగంటలు చదివాను. భవిష్యత్‌లో సీఏ కావడమే లక్ష్యం. - శశిప్రియ, ఎంఈసీ జిల్లా ప్రథమ ర్యాంకర్, జలజం కళాశాల