► ఇంటర్ ప్రథమలో 6 వ స్థానం, ద్వితీయలో 8
► ‘ప్రతిభ’కు స్టేట్ ర్యాంకులు
► మే 24న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: ఆర్‌ఐఓ సీతారాములు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోనూ బాలికలే పైచేసిసాధించారు. తొలిసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు ఒకే సారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లోగతేడాది 45 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 44 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరఫలితాలలో గతేడాది 52 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 9వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 55 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 8 స్థానం సాధించింది.
ఇంటర్ జనరల్ ఫస్టియర్..
జిల్లా వ్యాప్తంగా 31,502 మంది పరీక్షలు రాయగా 13,912 మంది.. 44 శాతం ఉత్తీర్ణులయ్యారు. 15,985 మంది బాలురలో 6,273 మంది (39 శాతం), 15,517 మంది బాలికల్లో 7,639 మంది (49 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ జనరల్ సెకండియర్
జిల్లా వ్యాప్తంగా 29,193 మంది హాజరు కాగా 16,178 మంది విద్యార్థులు.. 55శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 14,952 మంది బాలురకు 7.661 మంది (51 శాతం), 14,241 మంది బాలికలకు 8.517 మంది (60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు.
వొకేషనల్‌లో..
ప్రథమ సంవత్సరానికి 3,879 మంది హాజరు కాగా 1,763 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయకు 29,193 మంది హాజరు కాగా 16,178 మంది (55 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
మాడల్‌స్కూళ్లలో..
జిల్లాలోని ఏడు మోడల్ స్కూళ్లలో 262 బాలబాలికలు ఫస్టియర్ రాయగా 148 మంది (56 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 245 మంది సెకండియర్ రాయగా 143 మంది (58 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
ప్రభుత్వ కళాశాలల్లో..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 8,681 మంది హాజరు కాగా 4,026 మంది (46 శాతం), సెకండియర్‌కు 7,048 మంది హాజరు కాగా 4,753 మంది (67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ విభాగంలో ప్రథమకు 1284కి 946 మంది (74 శాతం), ద్వితీయకు 1,105 మంది హాజరు కాగా 896 మంది (81శాతం) ఉత్తీర్ణులయ్యారు.
ప్రైవేటు కళాశాలల్లో 42 శాతమే..
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 21,021 మంది విద్యార్థులు హాజరు కాగా 8,807 మంది విద్యార్థులు (42 శాతం), ద్వితీయకు 20,520 మంది హాజరు కాగా 10,453 మంది (51శాతం) ఉత్తీర్ణులయ్యారు.
గురుకుల విద్యాలయాలలో..
జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ప్రథమ సంవత్సర పరీక్షలు 911 మంది రాయగా 578 మంది (63శాతం) ద్వితీయ 857 మందికి 618 మంది (72శాతం) ఉత్తీర్ణులయ్యారు.
సత్తాచాటిన జిల్లా విద్యార్థులు..
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫ లితాలలో జిల్లా విద్యార్థులు తమ సత్తా చాటారు. ప్రథమసంవత్సరంలో జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థా యి ర్యాంకులు సాధించారు. ఎంపీసీలో 470కి 465 మార్కులు ముగ్గురు విద్యార్థులు జీ అఖిల్, కే సాయిలక్ష్మి, ఎం నవీన్‌సాగర్ సాధించి జిల్లా ప్రథమ స్థానం పొందారు. ప్రథమ సంవత్సర బైపీసీ విభాగంలో 440కి 436 మార్కులతో ఆసిమామహీన్ జిల్లా ప్రథమ, రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. ద్వితీయ సంత్సర ఎంపీసీలో వనపర్తి సీవిరామన్ విద్యార్థిని జి. సౌమ్య 990 మార్కులతో జిల్లా మొదటి స్థానంలో నిలవగా, జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థిని విశాలి 989 మార్కులు సాధించి జిల్లా ద్వితీయస్థానంలో నిలిచింది.
ఎంఈసీ విభాగంలో షాద్‌నగర్ విజ్ఞాన్ కళాశాల ద్వితీయ విద్యార్థి సాయికుమార్ 985 మార్కులతో స్టేట్‌ఫస్ట్ ర్యాంకు సాధించాడు. జిల్లా కేంద్రంలోని జలయం జూనియర్ కళాశాల విద్యార్థిని శశిప్రియ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంఈసీ విభాగంలో 482 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానం సాధించింది. సీఈసీ విభాగంలో ద్వితీయ సంవత్సరంలో 964 మార్కులతో విజ్ఞాన్ కళాశాల విద్యార్థిని జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
ప్రణాళికా బద్ధంగా చదవడంతో..
పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడంతో పాటు ప్రణాళికాబద్ధంగా చదవడంతో ఇంటర్ జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి 465 మార్కులు సాధించి జిల్లాప్రథమ స్థానం సాధించాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లనే అధిక మార్కులు సాధించాం. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావడమే లక్ష్యం. -జి. అఖిల్, ఎం. నవీన్‌సాగర్, సాయిలక్ష్మి, ఇంటర్ ఫస్టియర్ ఎంపిసీ జిల్లా ప్రథమ ర్యాంకర్లు
అధ్యాపకుల ప్రోత్సాహంతోనే..
అధ్యాపకులు, తల్లిదండ్రుల పోత్సాహంతోనే జిల్లా ద్వితీయ స్థానం సాధించాను. అధ్యాపకులు చెప్పిన పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవడం వల్లనే ఎంపీసీ విభాగంలో 989 పొందాను. ట్రిపుల్‌ఈలో ర్యాంకే లక్ష్యం. కళాశాలకు రెగ్యులర్‌గా రావడంతో పాటు, పాఠ్యపుస్తకాలు చదవాలి.
- బి. విశాలి, ఇంటర్ సీనియర్ ఎంపీసీ జిల్లా రెండో ర్యాంకర్, ప్రతిభ కళాశాల
సీఏ లక్ష్యం..
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంఈసీలో 482 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. నాన్న మనోహర్‌గౌడ్ ప్రొత్సాహం, అధ్యాపకుల సహకారం ఉంది. ప్రతి రోజు ఆరుగంటలు చదివాను. భవిష్యత్‌లో సీఏ కావడమే లక్ష్యం.
- శశిప్రియ, ఎంఈసీ జిల్లా ప్రథమ ర్యాంకర్, జలజం కళాశాల
బాలికలదే పైచేయి
Published Sat, Apr 23 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM
Advertisement
Advertisement