Supplementary examinations
-
టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 79 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 79.82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణుల య్యాయి. పాసయిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ముందు వరుసలో (97.99 శాతం) ఉంటే, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (53.11 శాతం)లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆగస్టు 1 నుంచి 10 వరకూ జరిగిన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెగ్యులర్‌గా జరిగిన పరీక్షల్లో కూడా ఈసారి 90 శాతంపైనే ఫలితాలు వచ్చినట్టు దేవసేన తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు లేకపోయినా, ఈసారి మంచి ఫలితాలు వచ్చాయని ఆమె తెలిపారు. నేటి నుంచి రీ కౌంటింగ్ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్‌లో విద్యార్థి పేపర్‌ను ఉపాధ్యాయులే తిరిగి పరిశీలిస్తారు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేస్తే, విద్యార్థి రాసిన సమాధాన పత్రం ప్రతిని ఇంటికి పంపుతారు. దీంతో విద్యార్థి స్వయంగా పరిశీలించుకునే వీలుంటుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం: దేవసేన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం కల్పించాలని సంబంధిత అధికారులను కోరుతామని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు దేవసేన తెలిపారు. కాగా, రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు మొదటి విడత యూనిఫాంలు పంపామని, రెండో విడత కూడా పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఆ పిల్లలను క్రమంతప్పకుండా స్కూళ్లకు పంపే విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. కాగా, టీచర్ల నియామకం గురించి ప్రభుత్వానికి వినతి పంపామని ఆమె వివరించారు. -
AP SSC Supplementary 2022: సప్లిమెంటరీలో పాసైనా 'రెగ్యులరే'
సాక్షి, అమరావతి: పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయామని ఆవేదన, ఆందోళన చెందాల్సిన పనిలేకుండా రాష్ట్రంలోని టెన్త్ 2022 బ్యాచ్ విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తదుపరి విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీరికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నెలరోజుల్లోనే నిర్వహించి ఫలితాలను ప్రకటించనుంది. అంతకన్నా ముఖ్యంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022–ఏప్రిల్ రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్ పాస్‌గానే పరిగణిస్తుంటారు. ఆమేరకు ధ్రువపత్రాలు జారీచేస్తారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే ‘కంపార్టుమెంటల్ పాస్’ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ దీనిపై ఉత్తర్వులు జారీచేయనుంది. ఈసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కంపార్టుమెంటల్‌గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తారు. వారు సాధించిన మార్కులను అనుసరించి ఫస్ట్‌క్లాస్, సెకండ్‌క్లాస్, థర్డ్‌క్లాస్‌లుగా డివిజన్లను ప్రకటిస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. గ్రేస్ మార్కులు కలపాలని పలువర్గాల నుంచి అందుతున్న వినతులపైనా ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చించింది. అయితే ఫెయిలైన సబ్జెక్టులకు పదివరకు గ్రేస్ మార్కులు కలిపినా మరో ఐదుశాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యే అవకాశముంది తప్ప అందరికీ ప్రయోజనం కలగదు. ప్రస్తుతం టెన్త్ ఉత్తీర్ణత శాతం 67.26 శాతం కాగా అది 73 శాతానికి చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా డివిజన్లు ఇవ్వడం వల్ల అత్యధిక శాతం మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లుగా కాకుండా సొంతంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినట్లు అవుతుందని వివరిస్తున్నారు. ఈసారి టెన్త్ పరీక్షల్లో 2 లక్షలమంది విద్యార్థులు ఫెయిలైన నేపథ్యంలో వారిని అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ విద్యార్థులు తప్పిన సబ్జెక్టులపై పాఠశాలల్లో ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనుంది. సప్లిమెంటరీలో వారు తప్పనిసరిగా ఉత్తీర్ణులయ్యేలా బోధన సాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా సబ్జెక్టు టీచర్లను అన్ని స్కూళ్లలోను సన్నద్ధం చేయిస్తోంది. పరీక్షలు పూర్తయ్యేవరకు ఈ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. తప్పిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నామని అధికారులు చెప్పారు. 20 వరకు సప్లిమెంటరీ ఫీజు గడువు రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నారు. మంగళవారం నుంచే ఈ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఫీజు చెల్లింపు గడువు ఈనెల 20వ తేదీవరకు ఉంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సమాచారంతో సంబంధం లేకుండా ఫెయిలైన వారంతా గడువులోగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ వచ్చిన మార్కుల పరిగణన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను.. ఉత్తీర్ణులైనవారు కూడా (ఇంప్రూవ్మెంట్ కోసం) రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పాసైనా.. తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థులు, మరిన్ని మార్కులు సాధించాలనుకున్నవారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. రెండింటిలో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. -
ఏపీ: సెప్టెంబర్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ఇంటర్ బోర్టు పేర్కొంది. -
ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో అక్రమాలు
నెల్లూరు(క్రైమ్): ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో జరుగుతున్న అక్రమాలు బయటపడ్డాయి. పరీక్షల్లో పాస్ అయ్యేలా చూస్తానంటూ విద్యార్థుల నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. విద్యార్థుల జవాబు పత్రాలు తీసుకుని తన ఇంట్లోనే పరీక్షలు రాయిస్తూ.. చివరకు పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వివరాలు.. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో డాక్టర్ శింగంశెట్టి భాస్కర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. సరస్వతీ నగర్‌లోని పూజ సత్యదేవమ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఆయన ప్లాట్‌లో ఎంబీబీఎస్ పరీక్షలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయంటూ నెల్లూరు దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ తన సిబ్బందితో కలిసి భాస్కర్ ప్లాట్‌పై శుక్రవారం దాడి చేశారు. భాస్కర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తుల్ని, ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెసెంజర్‌ను మేనేజ్ చేసి.. పట్టుబడిన ఐదుగురు విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. రూ.3.50 లక్షలిస్తే పరీక్షలు పాస్ చేయిస్తానంటూ భాస్కర్‌రావుతో పాటు ప్రసాద్, మహేంద్ర, జయకుమార్ అనే వ్యక్తులు విద్యార్థులతో ఒప్పందం చేసుకున్నారు. వీరి పథకం ప్రకారం.. విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాలి. జవాబు పత్రాల్లో ఖాళీ ఉంచి ఇన్విజిలేటర్‌కు ఇచ్చేయాలి. ఈ మేరకు ఐదుగురు విద్యార్థులూ శుక్రవారం బయోకెమిస్ట్రీ పేపర్–2 పరీక్షకు హాజరై.. ఖాళీ జవాబు పత్రాలు ఇచ్చేశారు. కాలేజీ సిబ్బంది పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను బండిల్స్‌గా చేసి స్పీడ్ పోస్టు ద్వారా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపిస్తుంటారు. దీనిని భాస్కర్ ముఠా తమకు అనుకూలంగా మలుచుకుంది. స్పీడ్ పోస్టు తీసుకెళ్లే మెసెంజర్‌ను కూడా తమ వైపునకు తిప్పుకున్నారు. అతని వద్ద ఉన్న బండిల్స్ నుంచి తాము ఒప్పందం కుదుర్చుకున్న విద్యార్థుల జవాబు పత్రాలు తీసుకునేవారు. అనంతరం భాస్కర్ తన ఇంటికి తీసుకెళ్లి ఆ జవాబు పత్రాలను మళ్లీ విద్యార్థులతో నింపించేవాడు. పని పూర్తయిన తర్వాత వాటిని యథావిధిగా మెసెంజర్‌కు ఇచ్చేసేవాడు. అతను రాత్రి 7.30కు వాటిని విజయవాడకు పంపేవాడు. శుక్రవారం కూడా ఇలాగే జవాబు పత్రాలను తీసుకుని విద్యార్థులతో పరీక్షలు రాయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? అసిస్టెంట్ సూపరింటెండెంట్ భాస్కర్, అతని బృందంతో పాటు, ఐదుగురు విద్యార్థులను ఠిపోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఎంత కాలం నుంచి సాగుతోంది? ఇంకా ఎంత మంది ఈ దందాలో ఉన్నారు? ఎంత మంది విద్యార్థుల నుంచి నగదు వసూలు చేశారు? తదితర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
గ్లోబరీనా తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల ప్రక్రియలో పొరపాట్లు చేసిన గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం పక్కన పెట్టింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్ కోసం కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను ప్రాసెస్ చేయాల్సి ఉంది. ఆ పనుల బాధ్యతలను గ్లోబరీనాకు అప్పగిం చకుండా, కొత్త సంస్థకు అప్పగించేందుకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. కనీసం 10 లక్షల మంది విద్యార్థుల డాటా ప్రాసెస్ చేసి ఉండాలన్న నిబంధనను అందులో పొందుపరిచింది. అంతేకాకుండా గతంలో 2 ఏళ్లపాటు ఇంటర్ బోర్డులో పనిచేసి ఉండకూడదనే నిబంధన కూడా విధించింది. దీంతో గ్లోబరీనా సంస్థ ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కోల్పోయింది. -
జూన్ 4 నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 4 నుంచి 19 వరకు నిర్వహించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్ జారీ చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొంది. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందని వెల్లడించింది. విద్యార్థులు మే 21 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఫీజును ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలని, రూ. 50 ఆలస్య రుసుముతో సంబంధిత సబ్జెక్టు పరీక్షకు రెండు రోజుల ముందు కూడా ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. మూడు లేదా అంతకంటే తక్కువ సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 ఫీజు చెల్లించాలని తెలిపింది. మరిన్ని వివరాలు http://bse.telangana.gov.in/ వెబ్సైట్లో పొందవచ్చని సూచించింది. -
4 నుంచి ఓయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ డిగ్రీ కోర్సుల (రెగ్యులర్/దూరవిద్య) సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్నట్లు గురువారం కంట్రోలర్ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. వచ్చే నెల 27 వరకు జరిగే డిగ్రీ పరీక్షల నిర్వహణ టైంటేబుల్‌ను త్వరలో వర్సిటీ వెబ్సైట్లో వెల్లడించనున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. -
బాలికలదే పైచేయి
► ఇంటర్ ప్రథమలో 6 వ స్థానం, ద్వితీయలో 8 ► ‘ప్రతిభ’కు స్టేట్ ర్యాంకులు ► మే 24న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు: ఆర్ఐఓ సీతారాములు మహబూబ్‌నగర్ విద్యావిభాగం: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోనూ బాలికలే పైచేసిసాధించారు. తొలిసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు ఒకే సారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లోగతేడాది 45 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 44 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరఫలితాలలో గతేడాది 52 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 9వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 55 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 8 స్థానం సాధించింది. ఇంటర్ జనరల్ ఫస్టియర్.. జిల్లా వ్యాప్తంగా 31,502 మంది పరీక్షలు రాయగా 13,912 మంది.. 44 శాతం ఉత్తీర్ణులయ్యారు. 15,985 మంది బాలురలో 6,273 మంది (39 శాతం), 15,517 మంది బాలికల్లో 7,639 మంది (49 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ జనరల్ సెకండియర్ జిల్లా వ్యాప్తంగా 29,193 మంది హాజరు కాగా 16,178 మంది విద్యార్థులు.. 55శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 14,952 మంది బాలురకు 7.661 మంది (51 శాతం), 14,241 మంది బాలికలకు 8.517 మంది (60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. వొకేషనల్‌లో.. ప్రథమ సంవత్సరానికి 3,879 మంది హాజరు కాగా 1,763 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయకు 29,193 మంది హాజరు కాగా 16,178 మంది (55 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మాడల్స్కూళ్లలో.. జిల్లాలోని ఏడు మోడల్ స్కూళ్లలో 262 బాలబాలికలు ఫస్టియర్ రాయగా 148 మంది (56 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 245 మంది సెకండియర్ రాయగా 143 మంది (58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 8,681 మంది హాజరు కాగా 4,026 మంది (46 శాతం), సెకండియర్‌కు 7,048 మంది హాజరు కాగా 4,753 మంది (67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ విభాగంలో ప్రథమకు 1284కి 946 మంది (74 శాతం), ద్వితీయకు 1,105 మంది హాజరు కాగా 896 మంది (81శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కళాశాలల్లో 42 శాతమే.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 21,021 మంది విద్యార్థులు హాజరు కాగా 8,807 మంది విద్యార్థులు (42 శాతం), ద్వితీయకు 20,520 మంది హాజరు కాగా 10,453 మంది (51శాతం) ఉత్తీర్ణులయ్యారు. గురుకుల విద్యాలయాలలో.. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ప్రథమ సంవత్సర పరీక్షలు 911 మంది రాయగా 578 మంది (63శాతం) ద్వితీయ 857 మందికి 618 మంది (72శాతం) ఉత్తీర్ణులయ్యారు. సత్తాచాటిన జిల్లా విద్యార్థులు.. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫ లితాలలో జిల్లా విద్యార్థులు తమ సత్తా చాటారు. ప్రథమసంవత్సరంలో జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థా యి ర్యాంకులు సాధించారు. ఎంపీసీలో 470కి 465 మార్కులు ముగ్గురు విద్యార్థులు జీ అఖిల్, కే సాయిలక్ష్మి, ఎం నవీన్‌సాగర్ సాధించి జిల్లా ప్రథమ స్థానం పొందారు. ప్రథమ సంవత్సర బైపీసీ విభాగంలో 440కి 436 మార్కులతో ఆసిమామహీన్ జిల్లా ప్రథమ, రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. ద్వితీయ సంత్సర ఎంపీసీలో వనపర్తి సీవిరామన్ విద్యార్థిని జి. సౌమ్య 990 మార్కులతో జిల్లా మొదటి స్థానంలో నిలవగా, జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థిని విశాలి 989 మార్కులు సాధించి జిల్లా ద్వితీయస్థానంలో నిలిచింది. ఎంఈసీ విభాగంలో షాద్‌నగర్ విజ్ఞాన్ కళాశాల ద్వితీయ విద్యార్థి సాయికుమార్ 985 మార్కులతో స్టేట్‌ఫస్ట్ ర్యాంకు సాధించాడు. జిల్లా కేంద్రంలోని జలయం జూనియర్ కళాశాల విద్యార్థిని శశిప్రియ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంఈసీ విభాగంలో 482 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానం సాధించింది. సీఈసీ విభాగంలో ద్వితీయ సంవత్సరంలో 964 మార్కులతో విజ్ఞాన్ కళాశాల విద్యార్థిని జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రణాళికా బద్ధంగా చదవడంతో.. పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడంతో పాటు ప్రణాళికాబద్ధంగా చదవడంతో ఇంటర్ జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి 465 మార్కులు సాధించి జిల్లాప్రథమ స్థానం సాధించాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లనే అధిక మార్కులు సాధించాం. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడమే లక్ష్యం. -జి. అఖిల్, ఎం. నవీన్‌సాగర్, సాయిలక్ష్మి, ఇంటర్ ఫస్టియర్ ఎంపిసీ జిల్లా ప్రథమ ర్యాంకర్లు అధ్యాపకుల ప్రోత్సాహంతోనే.. అధ్యాపకులు, తల్లిదండ్రుల పోత్సాహంతోనే జిల్లా ద్వితీయ స్థానం సాధించాను. అధ్యాపకులు చెప్పిన పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవడం వల్లనే ఎంపీసీ విభాగంలో 989 పొందాను. ట్రిపుల్‌ఈలో ర్యాంకే లక్ష్యం. కళాశాలకు రెగ్యులర్‌గా రావడంతో పాటు, పాఠ్యపుస్తకాలు చదవాలి. - బి. విశాలి, ఇంటర్ సీనియర్ ఎంపీసీ జిల్లా రెండో ర్యాంకర్, ప్రతిభ కళాశాల సీఏ లక్ష్యం.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంఈసీలో 482 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. నాన్న మనోహర్‌గౌడ్ ప్రొత్సాహం, అధ్యాపకుల సహకారం ఉంది. ప్రతి రోజు ఆరుగంటలు చదివాను. భవిష్యత్‌లో సీఏ కావడమే లక్ష్యం. - శశిప్రియ, ఎంఈసీ జిల్లా ప్రథమ ర్యాంకర్, జలజం కళాశాల -
అమ్మాయిలదే హవా
► ఇంటర్ ఫలితాల్లో నాలుగో స్థానం ► మళ్లీ విద్యార్థినులదే పై చేయి ... 79 శాతం పాస్ ► ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 76 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఆరేళ్లుగా బాలురను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తున్న బాలికలు మరోసారి పై చేయి సాధించారు. మంగళవారం ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసిన ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో బాలికలు ముందంజలో నిలిచారు.జిల్లాలో ప్రథమ సంవత్సర ఫలితాల్లో 70 శాతం, ద్వితీయ సంవత్సరంలో 76 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాలు ఒకే సారి విడుదల కావడం ఇదే తొలిసారి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ విభాగాల వారీగా అధిక మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి టాప్-10లో చోటు సంపాదించారు. ఫలితాలను ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించిన ఇంటర్మీడియెట్ బోర్డు మార్కుల రూపంలోనూ ప్రకటించింది. ప్రథమ సంవత్సరంలో 70 శాతం ... మార్చి నెలలో జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా హాజరైన 47,116 మంది విద్యార్థుల్లో 32,991 మంది ఉత్తీర్ణులయ్యారు. 70 శాతంఉత్తీర్ణత నమోదయ్యింది. వీరిలో బాలికలు 74 శాతం, బాలురు 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా వృత్తి విద్యాకోర్సుల నుంచి ప్రథమ సంవత్సరంలో 52 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 1,198 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 624 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 66 శాతం ఉత్తీర్ణత నమోదై, ఐదో స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుతం 70 శాతంతో 4వ స్థానానికి జారింది. ద్వితీయ సంవత్సరంలో 76 శాతం ... ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన 41,927 మంది విద్యార్థులలో 31,864 మంది ఉత్తీర్ణులయ్యారు. 76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 79 శాతం, బాలురు 73 శాతం ఉత్తీర్ణ నమోదు చేశారు. వృత్తి విద్యాకోర్సులలో 76 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పరీక్ష రాసిన 524 మందిలో 396 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 76 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచిన జిల్లా ప్రస్తుతం అదే ఉత్తీర్ణత శాతం నమోదైనప్పటికీ 4వ స్థానానికి దిగజారింది. మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పిన విద్యార్థులకు మే 24వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నా యి. సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలి. -
మనమే లాస్ట్
ఇంటర్ ‘ప్రథమ’ ఫలితాలు విడుదల రాష్ట్రంలో జిల్లాదే చివరి స్థానం జనరల్‌లో 38 శాతం.. ఒకేషనల్‌లో 33 శాతం ఉత్తీర్ణత గతేడాది కంటే 8.5 శాతం తగ్గుదల మే 25 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఏడాది మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. గతేడాది 13వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 23వ స్థానానికి దిగజారింది. గతేడాది 48 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సంవత్సరం 38 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. ఫలితాలు మెరుగ్గా రాకపోయినా కష్టపడి చదివిన విద్యార్థులు పాసైతే తమకు సంతోషమని అప్పట్లోనే పేర్కొన్న విషయం తెలిసిందే. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంతో ఫలితాల శాతం తగ్గినట్లు కనబడుతోంది. ఈ ఏడాది కూడా బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచారు. తగ్గిన ఉత్తీర్ణత శాతం జనరల్ కోర్సుల్లో 24,449 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 9,232 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 11,874 మంది పరీక్షకు హాజరు కాగా, 3,658 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 31 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 12,619 మంది పరీక్షకు హాజరు కాగా, 5,574 మంది ఉత్తీర్ణత సాధించారు. 44 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్ కోర్సుల్లో 3,349 మంది పరీక్షకు హాజరు కాగా, 1,110 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలురు 2,214 మంది పరీక్షకు హాజరు కాగా, 670 మంది ఉత్తీర్ణులయ్యారు. 30 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 1,135 మంది పరీక్షకు హాజరుకాగా, 440 మంది పాసయ్యారు. 39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే ఈ ఏడాది 8.5 శాతం తగ్గింది. ఫలితాలను గ్రేడ్ల రూపంలో, మార్కుల రూపంలో విడుదల చేశారు. 75 శాతంపైగా మార్కులు వచ్చిన వారికి గ్రేడ్ ‘ఏ’, 60 నుంచి 75 శాతం మార్కులు వచ్చిన వారికి గ్రేడ్ ‘బీ’, 50 నుంచి 60 శాతం మార్కులు వచ్చిన వారికి గ్రేడ్ ‘సీ’, 35 నుంచి 50 శాతం మార్కులు వచ్చిన వారికి గ్రేడ్‘డీ’ కేటాయించారు. మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఆర్ఐవో ఫజలుల్లా తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మే 6లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. రీ కౌంటింగ్ కోసం రూ. 100, జిరాక్స్‌కాపీ కోసం రూ. 600 డీడీ తీయాల్సి ఉందన్నారు. టాపర్లు వీరే.. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఎంపీసీలో దీక్ష జూనియర్ కళాశాల నిర్మల్‌కు చెందిన డి.విఘ్నేశ్వర్ 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించారు. ఆదిలాబాద్ పట్టణంలోని నలంద కళాశాలకు చెందిన శ్వేతకు 461, బైపీసీలో మంచిర్యాలలోని అల్పోర్స్ జూనియర్ కళాశాలలో ఫరాసమ్రీన్కు 440 మార్కులకు 433 మార్కులు వచ్చాయి. ఆదిలాబాద్ పట్టణంలోని క్రిసెంట్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి ముషారఫ్ అజ్జుమంద్ 440 మార్కులకు 431 మార్కులు వచ్చాయి. ఎంఈసీలో మంచిర్యాలలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన సునీషా 500 మార్కులకుగాను, 484 మార్కులు సాధించారు. ఎనిమిదేళ్ల ఫలితాలు.. సంవత్సరం ఫలితాల శాతం 200607 44.89 200708 49.78 200809 45.61 200910 45.00 201011 49.00 201112 47.00 201213 46.50 201314 38.00