
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ఇంటర్ బోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment