సీఎం, రావెల క్షమాపణ చెప్పాలి | CM, ravela reiterate the apology | Sakshi
Sakshi News home page

సీఎం, రావెల క్షమాపణ చెప్పాలి

Published Wed, Mar 30 2016 3:02 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM

CM, ravela reiterate the apology

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: పేద వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన బాబా సాహెబ్ అంబేడ్కర్ పట్ల సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఎస్సీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్‌లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కంబాల జోగులు, ఐజయ్య, సునీల్‌లు మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉండి ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అని వ్యాఖ్యానించి దళితుల ఆత్మగౌరవాన్ని కించపరచారని, అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిస్తామని వల్లె వేసే మంత్రి రావెల బూట్లు వేసుకునే అంబేడ్కర్‌కు నివాళులర్పించారని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement