
అమరావతిలో అంబేడ్కర్ స్మృతి చిహ్నం
10 ఎకరాల్లో ఏర్పాటు: మంత్రి రావెల కిశోర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో పదెకరాల్లో అంబేడ్కర్ స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణపై సదస్సు నిర్వహించారు. అంబేడ్కర్ 125వ జయంతిని ఏడాది పొడవునా నిర్వహించేందుకు కేంద్రం తయారు చేసిన ప్రణాళికను రాష్ట్రంలోనూ అమలు చేయడానికి అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకుంటామని రావెల చెప్పారు. వాటిపై కేబినెట్‌లో చర్చించి ఉత్సవాలకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.