సర్పంచ్లు టీడీపీలో చేరేది అవాస్తవం.. | ysrcp leader raavi venkata ramana fires on minister ravela kishore babu | Sakshi
Sakshi News home page

సర్పంచ్లు టీడీపీలో చేరేది అవాస్తవం..

Published Sun, Feb 21 2016 1:40 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

ysrcp leader raavi venkata ramana fires on minister ravela kishore babu

గుంటూరు: మంత్రి రావెల కిషోర్ బాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రావి వెంకటరమణ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో ఆయన ఆదివారం మాట్లాడుతూ...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద మెప్పుకోసమే మంత్రులు అవాస్తవాలు చెప్పుతున్నారని దుయ్యబట్టారు.

గుంటూరుకు చెందిన 40 మంది వైఎస్సార్ సీపీ సర్పంచ్లు టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించిన మంత్రి రావెల వ్యాఖ్యలు అవాస్తమని రావి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతిపరులే ఆ పార్టీలో చేరారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎవ్వరూ చేరలేదని చెప్పారు. టీడీపీలో చేరిన 40 మంది సర్పంచ్ల పేర్లను వెల్లడించాలన్నారు. సీఎంకు గొప్పలు చెప్పుకునేందుకే రావెల ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వెంకటరమణ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement