
'నీవు చంద్రబాబు దగ్గర పెద్ద పాలేరు'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుపై ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నిప్పులు చెరిగారు. శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ రావెల కిషోర్ బాబుకు సూచించారు. ఎమ్మార్పీఎస్కు వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదంటూ మంత్రి రావెలను హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడి వద్ద నీవు పెద్ద పాలేరు అంటూ ఎద్దేవా చేశారు.
నీవు చట్టాన్ని గౌరవించేవాడివైతే... నీ కుమారుడిని శిక్షించాలని రావెలకు పిల్లి మాణిక్యరావు హితవు పలికారు. మార్చి పదో తేదీన నారావారిపల్లె నుంచి మాదిగ విశ్వరూప చైతన్య యాత్ర ప్రారంభమవుతోందని ఈ సందర్భంగా మాణిక్యరావు తెలిపారు.