హాస్టళ్లలో మంత్రి రావెల తనిఖీ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం):
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను, పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. కొండపల్లిలోని ఎస్టీ రెసిడెన్సియల్, పాఠశాల, బీసీ హాస్టల్‌ను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. విద్యార్థునుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారుండే గదులు పరిశీలించారు. వారితో పాటు సహపంక్తి భోజనం చేసి వారికి మిఠాయిలు తినిపించారు. కొండపల్లిలో స్థలం కేటాయిస్తే యూత్‌ట్రైనింగ్ సెంటర్‌కు రూ.4 కోట్లు కేటాయిస్తానన్నారు. కొండపల్లి సర్పంచి అమ్మాజీ మాట్లాడుతూ 60మంది విద్యార్థులు కలిగిన హాస్టల్‌కు పూర్తిస్థాయి వార్డెన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీపీ చీదిరాల ప్రసూన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈయన వెంట రాష్ట్ర గిరిజన సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు ఏ.బద్దయ్య, స్థానిక నాయకులు చిమటా ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.