దళితుల్లో విప్లవం రావాలి
-
సంక్షేమ పథకాలు పెడుతున్నా ఎందుకు ముందుకు రావట్లేదు..
-
సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల
నెల్లూరు(సెంట్రల్)
సమాజంలో దళితులు అభివృద్ధి చెందాలంటే వారిలో విప్లవం రావాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో బుధవారం జరిగిన చంద్రన్న దళిత బాట కార్యక్రమంలో మంత్రి రావెల ముఖ్యఅతిదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నాచితకా ఉద్యోగాలు మాని పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఒక విప్లవంలాగా మార్పు రావాలన్నారు. ప్రభుత్వం చాలా పథకాలు అమలుచేస్తున్నా చాలామంది ముందుకు రాలేదన్నారు. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపే విఽధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తమలో తాము దోపిడీకి గురికాకుండా, అభివృద్ధి పథం వైపు నడవాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రవేశపెట్టే పథకాలను దళితులు తెలుసుకోవాలన్నారు. రానున్న రోజులలో అర్హులైన దళితులకు జీవానోపాధికి క్యాబ్‌లను అందిస్తామన్నారు. దీంతో పాటు తిరుమలలో దళితులు షాపులు పెట్టుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తొలుత నర్తకి సెంటరులోని నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వీఆర్సీ మైదానానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముత్యాల రాజు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్‌రావు, ఎస్సీ కాఽర్పొరేషన్ ఈడీ రామచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.