'మంత్రి రావెల అవివేకానికి నిదర్శనం' | Tammineni Sitaram takes on ravela kishore babu | Sakshi
Sakshi News home page

'మంత్రి రావెల అవివేకానికి నిదర్శనం'

Published Thu, Jun 30 2016 1:23 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

Tammineni Sitaram takes on ravela kishore babu

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం గురువారం శ్రీకాకుళంలో నిప్పులు చెరిగారు. ఆస్తుల అటాచ్మెంట్ అనే పదానికి అర్థం తెలియకుండా మాట్లాడటం మంత్రి రావెల అవివేకానికి నిదర్శనమన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఎందుకు దేశ బహిష్కరణ చేయకూడదని ప్రశ్నించారు. అలాగే ఈవ్ టీజింగ్ కేసులో అరెస్ట్ అయిన మంత్రి రావెల కుమారుడిని ఎందుకు రాష్ట్ర బహిష్కరణ చేయకూడదని ప్రశ్నించారు. ఒకే ఎఫ్ఐఆర్పై 11 ఛార్జీషీట్లు వేయడం అంటేనే అక్రమ కేసు అని అర్థమవుతుందని తమ్మినేని సీతారాం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement