రావెల సుశీల్పై కేసు కొట్టేసిన హైకోర్టు | i dont know ravela susheel says victim to high court | Sakshi
Sakshi News home page

రావెల సుశీల్పై కేసు కొట్టేసిన హైకోర్టు

Published Mon, Apr 25 2016 12:42 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

రావెల సుశీల్పై కేసు కొట్టేసిన హైకోర్టు - Sakshi

రావెల సుశీల్పై కేసు కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ కారు నడుపుతూ ఓ ముస్లిం యువతి చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చిన విషం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. దీనిపై పోలీసులు సుశీల్ పై కేసులు కూడా పెట్టారు.

అయితే ఈ కేసులో బాధితురాలుగా ఉన్న మహిళ కోర్టుకు వచ్చి రావెల కిశోర్ ఎవరో తనకు తెలియదని అఫిడవిట్ ఇచ్చింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సుశీల్ పై పెట్టిన కేసును తొలగిస్తున్నట్టు హైకోర్టు వెల్లడించింది. తనపై పోలీసులు మోపిన అభియోగాలు తప్పుడువని చెబుతూ, ఇటీవల కోర్టులో సుశీల్ తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా, బాధితురాలిగా పోలీసులు పేర్కొన్న మహిళ తనకు సుశీల్ ఎవరో తెలియదని చెప్పడంతో కేసు వీగిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement