అంతులేని అధికార దుర్వినియోగం | The endless abuse of authority | Sakshi
Sakshi News home page

అంతులేని అధికార దుర్వినియోగం

Published Tue, Mar 7 2017 10:51 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

అంతులేని అధికార దుర్వినియోగం - Sakshi

అంతులేని అధికార దుర్వినియోగం

మంత్రి గంటాతో టీచర్ల సమావేశం ఏర్పాటు చేసిన ఆర్‌ఐఓ
ఆర్‌సీ పురం గురుకుల పాఠశాలలో మంత్రి రావెల ఎన్నికల ప్రచారం
పట్టభద్రులు, ఉపాధ్యాయులకు స్మార్ట్‌ ఫోన్ల పంపిణీ ప్రారంభించిన టీడీపీ
తప్పుడు ఫిర్యాదులతో వైఎస్సార్‌ సీపీ నేతల మీద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
టీడీపీ నేతల మీద ఫిర్యాదులను పక్కన పడేస్తున్న పోలీసు అధికారులు


సాక్షి ప్రతినిధి – నెల్లూరు : తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటా కింద ఎన్నిక జరుగుతున్న శాసన మండలి స్థానాన్ని గెలుపొందడానికి తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం జోరు పెంచింది. నయానోభయానో ఉపాధ్యాయుల ఓట్లు కొల్లగొట్టడానికి మంత్రులు పి.నారాయణ,  గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్‌ బాబు నేరుగా రంగంలోకి దిగారు. వైఎస్సార్‌సీపీ నేతల మీద ఫిర్యాదు రావడమే ఆలస్యంగా కిడ్నాప్‌ కేసులు నమోదు చేస్తున్న పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతలకు ఈ చట్టాలు వర్తించవనే రీతిలో పని చేస్తున్నారు. ఉపాధ్యాయ, పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గడువు సోమవారం ముగియడంతో టీడీపీ నేతలు నగదు, స్మార్ట్‌ ఫోన్ల పంపకాలకు తెర లేపారు.

ఉపాధ్యాయుల ఓట్ల కోసం మంత్రుల రహస్య సమావేశాలు
ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఓటర్ల జాబి తాలో తామే అత్యధికంగా ఓటర్లను చేర్పిం చినట్లు టీడీపీ ప్రకటించుకుంది. ఈ స్థానా లకు అసలు పోటీనే ఉండదని భావించిం ది. అయితే ఎన్నికలకు సమ యం దగ్గర పడే కొద్దీ అధికార పార్టీకి ఎదురీదాల్సిన వాతావరణం ఏర్పడింది. దీంతో గెలుపు మీద భయంతో అధికారులను అడ్డుపెట్టు కుని ఉపాధ్యాయుల ఓట్లు బలవంతంగా సంపాదించడానికి మంత్రులు నేరుగా రం గంలోకి దిగారు. మంత్రి నారాయణ ఇటీవల తన వైద్య కళాశాలలో ప్రైవేట్‌ టీచర్లతో సమావేశౖ మె తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మంత్రి రావెల కిషోర్‌ బాబు ఇదే కళాశాలలో గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ అభ్య ర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు.

సోమవారం రాత్రి 7గంటలకు నారాయణ మెడికల్‌ కళాశాలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లతో మంత్రి గంటా శ్రీనివాసరా వు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియేట్‌ బోర్డు ప్రాంతీ య అధికారి బాబు జాకబ్‌  ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠ శాలల ఉపాధ్యాయులను ఈ సమావేశానికి అధికారికంగా ఆహ్వానించా రు. సమావేశం అనంతరం రాత్రి విందు కూడా ఏర్పాటు చేసినట్లు మెసేజ్‌లు పంపారు. అధికార దుర్వినియోగం మీద యూటీఎఫ్‌ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు, ఆర్‌ఐఓ జాకబ్‌ను నిలదీశారు. దీంతో ఈ సమా వేశం రద్దు చేసి నగరంలోని ఒక ప్రముఖ హోటల్‌లో  అనధికారికంగా ఈ సమావే శం నిర్వహించి ఉపాధ్యాయు లందరూ తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి రావెల్‌ కిషోర్‌ బాబు రాత్రి 8 గంటల సమయం లో బుచ్చిరెడ్డిపాలెం మండలం రామ చంద్రాపురం గురుకుల పాఠశాలకు వచ్చారు. ఇక్కడ ఉపాధ్యా యులందరినీ సమావేశ పరచి టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తేనే మీకు మేలు జరుగుతుందని హుకుం జారీ చేశారు. మంత్రుల వెంట సంబంధిత శాఖల అధికారులు కూడా ఈ రహస్య సమావేశాలకు హాజరు కావ డం విమర్శలకు దారి తీసింది. జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల టీచర్లందరినీ సోమవారం రాత్రి నెల్లూరులోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో సంగంకు చెందిన ఒక  రిటైర్డ్‌ అధికారి ద్వారా టీడీపీ నేతలు  సమావేశం ఏర్పాటు చేయించారు. వీరికి ఓటుకు నోటు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

పంపకాలకు తెరలేపారు
పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెర పడింది. దీంతో టీడీపీ నేతలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు రూ.4 వేల విలువ చేసే స్మార్ట్‌ ఫోన్లు, ఖర్చులకు నగదు పంపకాలు ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి పేరుతో పట్టభద్రుల మొబైల్‌ ఫోన్లకు వాయిస్‌ కాల్‌ వస్తోంది. పట్టాభి రామిరెడ్డి మీకు స్లిప్‌ పంపించారా? పంపి ఉంటే 1 నొక్కండి. మా వాళ్లు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. పంపక పోతే 2 నొక్కండి అని స్మార్ట్‌ ఫోన్ల పంపిణీకి సంబంధించిన ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులకు కూడా ఓటుకు నోట్లు పంపిణీ చేసే సంస్కృతి ప్రారంభించారు.

పోలీసుల పసుపు సేవ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీని గెలిపించడానికి కొందరు పోలీసు అధికారులు టీడీపీ సేవలో నిమగ్నమయ్యారు. ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు ఫిర్యాదులు అందినా క్షణాల్లో కిడ్నాప్, ఎస్‌సీ, ఎస్‌టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు అధికార పార్టీ నాయకుల మీద ఫిర్యాదు వస్తే అస్సలు స్పందించడం లేదు.

► చిట్టమూరు మండలం మల్లాం –1, మల్లాం–2 ఇండిపెండెంట్‌ ఎంపీటీసీలు కత్తి  చెంగయ్య,  తిరుమూరు అశోక్‌ను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డితో పాటు మరికొంత మంది కిడ్నాప్‌ చేశారని అశోక్‌ అన్న చెంగయ్య మీద టీడీపీ నేతలు  ఒత్తిడి తెచ్చి తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. ముందు, వెనుకా ఆలోచించకుండా పోలీసులు అమితమైన స్వామి భక్తి ప్రదర్శించి దువ్వూరు బాల చంద్రారెడ్డితో పాటు మరి కొందరిపై కిడ్నాప్‌.. ఎస్‌సీ, ఎస్‌టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు. తాము స్వచ్ఛందంగా వైఎస్సార్‌ సీపీకి మద్దతు ఇవ్వడానికి వచ్చామని ఎంపీటీసీలు చెబుతున్నా పోలీసులు బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులకు అప్పగించారు. తమ కుమారుడు అశోక్‌ను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని మల్లాం –2 ఎంపీటీసీ అశోక్‌ తల్లి దండ్రులు తిరుమూరు అంకయ్య, రాజేశ్వరమ్మ విలేకరులతో చెప్పారు. తహసీల్దార్‌కు కూడా తాము ఇదే వాంగ్మూలం ఇచ్చామని, తమ కుమారుడిని కిడ్నాప్‌ చేసినట్లు ఫిర్యాదే చేయలేదని వారు చెప్పారు.

► నాయుడు పేట 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ రమణమ్మను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, నాయుడు పేట మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రఫీ వైఎస్సార్‌ సీపీలో చేరా>్చరు. దీనిని మనసులో ఉంచుకుని అదే మండలం విన్నమాల టీడీపీ ఎంపీటీసీ రమణమ్మను వీరు బెదిరించినట్లు ఫిర్యాదు ఇప్పించి ఎస్‌సీ ఎస్‌టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయించారు. పోలీసు బలగాలను వీరి ఇళ్ల మీదకు యుద్ధానికి పంపి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు.

►  కోట మండలం చిట్టేడు వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ సభ్యులు కుడుముల అంకమ్మను వైఎస్సార్‌ సీపీ నాయకులే కిడ్నాప్‌  చేశారని టీడీపీ నేతలు ఆమె అత్త వెంకటమ్మతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని అంకమ్మ శనివారం స్వయంగా తహసీల్దారు, పోలీసు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు.

► ఉదయగిరి మండలం చెరువుపల్లి టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు అరవ వెంకటేశ్వర్లు ఈ నెల 4వ తేదీ స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ నేతలు ఆయన భార్య సునీత మీద ఒత్తిడి తెచ్చి వైఎస్సార్‌సీపీ నేతలు చేజర్ల సుబ్బారెడ్డి, అబ్దుల్‌ అహ్మద్‌ తమ భర్తను కిడ్నాప్‌ చేశారని నెల్లూరు రెండో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే వీరి మీద కేసు నమోదు చేశారు.

► ఉదయగిరి మండలం బండగాని పల్లి ఎంపీటీసీ సభ్యురాలు మేడిపల్లి వెంగమ్మ ను టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, వెంగళరావు నగర్‌ ఎంపీటీసీ జే రమేష్‌ శనివారం అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకుని పోయారని ఆమె భర్త రామయ్య సోమవారం సాయంత్రం ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇక్కడ మాత్రం వేగంగా స్పందించలేదు. కేసు నమో దు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఫిర్యాదు వచ్చింది టీడీపీ నేతల మీద కావడం తో ఈచట్టాలు టీడీపీ నేతలకు వర్తించవనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement