ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీ నేతలు విందు రాజకీయాలతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
గుంటూరు : ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీ నేతలు విందు రాజకీయాలతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. గుంటూరు రూరల్ మండలం బుడంపాడులో టీడీపీ నేతలు ....విందు ఏర్పాటు చేయటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్ బాబులపై చర్యలు తీసుకోవాలని వారు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కాగా చర్చి ఆవరణలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రావెల కిషోర్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.