Dinner Politics
-
గల్లా, రావెల విందు రాజకీయాలు
గుంటూరు : ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీ నేతలు విందు రాజకీయాలతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. గుంటూరు రూరల్ మండలం బుడంపాడులో టీడీపీ నేతలు ....విందు ఏర్పాటు చేయటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్ బాబులపై చర్యలు తీసుకోవాలని వారు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కాగా చర్చి ఆవరణలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రావెల కిషోర్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాంగ్రెస్ నేతల విందు రాజకీయం..!!
విజయనగరంఫోర్ట్,న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ నేతలు విందు రాజకీయానికి తెరదీశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లకు విందు ఆఫర్ చేశారు. మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి యడ్లరమణమూర్తి దుప్పాడ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారసభ అనంతరం మటన్, చికెన్ బిర్యానీతో కార్యకర్తలు, స్థానికులకు విందు ఏర్పాటు చేశారు. సుమారు 600 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విందు కోసం రూ. 40 వేలు వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రచారంలో పాల్గొన్నకార్యకర్తలకు ఒక్కొక్కరికీ మద్యం బాటిల్ ఇచ్చినట్టు భోగట్టా. -
ఆచరణ సాధ్యం కాని హామీలిస్తే ఎలా?
* లోకేష్‌ను నిలదీసిన చిరువ్యాపారి భీమవరం, న్యూస్‌లైన్: ‘మీ తండ్రి చంద్రబాబు ఆల్‌ఫ్రీ అంటూ అనేక హామీలు ఇస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల నెత్తిన భారం వేస్తారా...’ అంటూ నారా లోకేష్‌ను భీమవరం పట్టణానికి చెందిన చిరు వ్యాపారి కారుమూరి భాస్కర్ నిలదీశారు. సోమవారం స్థానిక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లో వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, వ్యాపారులు, విద్యార్థులతో లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాస్కర్ సంధించిన ప్రశ్నకి లోకేష్ జవాబు చెప్పలేక సమాధానాన్ని దాటవేశారు. అగ్రవర్ణాల్లో పేద విద్యార్థులు రిజర్వేషన్ సమస్యతో సతమతమవుతున్నారని, దీనిని పరిష్కరించాలని విష్ణు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని భవాని కోరారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ.. ఇటువంటి పెద్ద సమస్యలపై తనను అడగవద్దని, ఇలాంటి విషయూలను ఆయన (చంద్రబాబు) చూసుకుంటారని చెప్పి తప్పించుకున్నారు. అలాగే, తెల్లకార్డు ద్వారా మీరు పేదలకు ఎటువంటి వైద్యసేవలు అందిస్తారో చెప్పాలని వైద్యుడు పీఆర్కే వర్మ కోరగా, దీనికి కూడా ఆయనే చూసుకుంటారు అని లోకేష్ సమాధానం చెప్పడంతో ‘అయితే మీరెందు కు వచ్చారు’ అంటూ పలువురు గొంతెత్తి అరవడంతో మిగిలిన వారు నవ్వుకున్నారు. లోకేష్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని గ్రహించి ఒక్కొక్కరుగా జారుకోవడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. విందు రాజకీయం సభలు, సమావేశాలకు జనం రాకపోవడంతో కంగుతిన్న లోకేష్ విందు రాజకీయాలకు తెరతీశారు. భీమవరంలోని త్రీస్టార్ హోటల్‌కు ప్రముఖులను ఆహ్వానించి ఆయన విందు ఇచ్చారు. భోజనాలు, స్నాక్స్, చల్లని పానీయాలు అందించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన తండ్రి చంద్రబాబు సీమాంధ్రని సింగపూర్, మలేసియా, దక్షిణకొరియా దేశాలుగా తీర్చిదిద్దుతారని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. ఆత్మీయ సమావేశం అని పిలిచి రాజకీయ ప్రసంగాలు చేయటమేమిటని పలువురు నిలదీయడం కొసమెరుపు. -
కాంగ్రెస్ 'విందు' రాజకీయాలు
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా బిల్లు మద్దతు ఇచ్చేలా బీజేపీని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈనెల 13న తెలంగాణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కీలక తెలంగాణ బిల్లుకు పూర్తి సహకారం కోరుతూ ప్రధాని మన్మోహన్సింగ్ బీజేపీ నేతలకు ఈ నెల 12న విందు ఇస్తున్నారు. ఈ మేరకు బీజేపీ అగ్రనేతలను ప్రధాని స్వయంగా గత రాత్రి ఫోన్ ద్వారా ఆహ్వానించారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీని తన నివాసంలో విందుకు రావాలని కోరారు. కాగా షెడ్యూల్ ప్రకారం సోమవారం ఈ విందు ఏర్పాటు చేయాల్సి ఉన్నా... అద్వానీ అందుబాటులోకి లేనందున ఈ కార్యక్రమం బుధవారానికి వాయిదా పడింది.