50 యూనిట్ల వరకూ ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ | 50 units of the SC and ST to free electricity | Sakshi
Sakshi News home page

50 యూనిట్ల వరకూ ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్

Published Sun, Mar 27 2016 12:56 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM

50 యూనిట్ల వరకూ ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ - Sakshi

50 యూనిట్ల వరకూ ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్

♦ ఆపై వాడే విద్యుత్‌కే ఛార్జీ వసూలు
♦ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు గృహవినియోగ విద్యుత్‌ను 50 యూనిట్ల వరకూ ఉచితంగా అందించే పథకంలో మార్పులు చేసి.. మరింత మందికి లబ్ధి చేకూర్చుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నెలకు 51 యూనిట్ల విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం వర్తించడం లేదన్నారు.

ఇకపై 50 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగానూ.. ఆపైన వినియోగించే విద్యుత్‌కు మాత్రమే ఛార్జీలు వసూలు చేసేలా పథకంలో మార్పులు చేశామని వివరించారు. దీని వల్ల ఆరు లక్షల ఎస్సీ, 90 వేల ఎస్టీ కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే పథకానికి రూ.76 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నాలుగు ఎల్‌ఈడీ బల్బుల చొప్పున పంపిణీ చేస్తామని.. తద్వారా ఆ కుటుంబాలు నెలకు 50 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగించే అవకాశం ఉంటుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement