రోజా స్త్రీయేనా..?: రావెల | Minister Ravela Kishore Babu comments on Mla Roja | Sakshi
Sakshi News home page

రోజా స్త్రీయేనా..?: రావెల

Published Thu, Jan 12 2017 2:19 AM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

రోజా స్త్రీయేనా..?: రావెల - Sakshi

రోజా స్త్రీయేనా..?: రావెల

  • వైఎస్‌ జగన్, బొత్స చీడపురుగులు
  • ప్రత్తిపాడులో మంత్రి అనుచిత వ్యాఖ్యలు  
  • ప్రత్తిపాడు: రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు బుధవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన జన్మభూమి–మావూరు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెను అసలు స్త్రీయేనా? అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. ‘‘చంద్రబాబుపై నోరుజారితే ఖబడ్దార్‌. నాలుకలకు కత్తెరవేస్తాం. సర్జరీ చేస్తాం. రోజా ఏం మాట్లాడుతుందండి.

    అసలు రోజా ఒక స్త్రీయేనా? స్త్రీజాతి సిగ్గుతో తలొంచుకోవాలి. ఆమె మాటేంటి? ఆమె వేషమేంటి? ఆమె భాషేంటి? ఆమె ప్రవర్తనేంటి? అసెంబ్లీలో బూతులు మాట్లాడేటటువంటి అరాచకవాది రోజా. అలాంటి రోజా కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారు’’ అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ పైనా మంత్రి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. కిశోర్‌ బాబంటే జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు భయం పట్టుకుందన్నారు. జగన్, బొత్సవంటి నాయకులు ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులని, వాటిని మందు వేసి తరిమికొట్టాలని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement