
'ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు'
అమరావతి: లక్ష ఎకరాల్లో గిరిజనుల ద్వారా కాఫీ తోటలు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
విశాఖ, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 800 మందికి, ఎంటర్‌ప్రై న్యూర్‌షిప్ ప్రోగ్రామ్లో 220 మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఐదు లక్షల వరకు రుణం ఇచ్చి పండ్లతోటలు, ఎన్‌టీఆర్ జలసిరి కింద ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా కాఫీ తోటలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.