మంత్రి రావెల నుంచి రక్షణ కల్పించాలి
-
టీడీపీ నాయకుల దౌర్జన్యంపై నడింపాలెం గ్రామస్తుల ధర్నా
-
నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్
ప్రత్తిపాడు (పెదనందిపాడు): ‘మా ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన భాధ్యత రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖామాత్యుడు రావెల కిషోర్‌బాబుదే’నని నడిపాలెం గ్రామస్తులు పేర్కొన్నారు. సోమవార మధ్యాహ్నం పట్టణంలోని తహశీల్దారు కార్యాలయం వద్ద
టీడీపీ నాయకుల దౌర్జన్యకాండపై చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. నడింపాలెంకు చెందిన 2వ వార్డు సభ్యుడు పాలెపు నాగేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారని, మంత్రి పీఎ సిద్దెల దినేష్, టీడీపీ నాయకుడు వెలివెల్లి సుబ్బారావుతో పాటు మరికొందరు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి రావెల తమకు రక్షణ కల్పించాలన్నారు. అనంతరం తహశీల్దార్ సీహెచ్ పద్మావతి, ఎస్.ఐ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో బి.భగత్‌సింగ్, ఉండ్రాసి నాగేశ్వరరావు, సిద్దెల దాసు, దాసరి శ్రీను, బండారు ఇస్రాయేలు, నాగార్జున, శ్యాంబాబు, ఆశీర్వాదం, రత్నబాబు మరియు గ్రామ మహిళలు తదితరలు పాల్గొన్నారు.
గ్రామంలో ఉండాలంటే భయమేస్తుంది..
గ్రామంలో ఉండాలంటే భయమేస్తుంది. మా నాన్న గ్రామ సమస్యలు పరిష్కరించాలని అడిగినందుకు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాత్రి ఒక్కడిని చేసి దాడిచేయడం హేయం. నిందితులపై చర్యలు తీసుకోవాలి.
– కోండపాటూరి బుజ్జి, బాధితుడి కుమార్తె
నిందితులను అరెస్ట్ చేస్తాం..
నిందితులు ఎవరైనా çవదిలిపెట్టం. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తాం. గ్రామంలో గొడవలు జరుగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశాం. గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదు.
– ప్రత్తిపాడు ఎస్‌ఐ ఎ బాలకృష్ణ