నాకు సన్మానం చేస్తే చంద్రబాబుకు చేసినట్లే.. | Minister ravela Kishore Babu Comments on Chief Minister Chandrababu | Sakshi
Sakshi News home page

నాకు సన్మానం చేస్తే చంద్రబాబుకు చేసినట్లే..

Published Wed, Feb 10 2016 1:06 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM

నాకు సన్మానం చేస్తే చంద్రబాబుకు చేసినట్లే.. - Sakshi

నాకు సన్మానం చేస్తే చంద్రబాబుకు చేసినట్లే..

సమీక్ష సమావేశంలో మంత్రి రావెల
పెదనందిపాడు: ‘నాకు సన్మానం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సన్మానం చేసినట్లే’ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజనసంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. మంగళవారం పెదనందిపాడు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరిగిన పెదనందిపాడు ఆధికారుల సమీక్ష సమావేశంలో అంగన్‌వాడీలకు జీతాలు పెంచినందుకుగాను అంగన్‌వాడీ కార్యకర్తలు మంత్రి రావెలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీకు జీతాలు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదని, మీరు ముఖ్యమంత్రికి సన్మానం చేయాలి.. నాకు సన్మానం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్మానం చేసినట్లే’ అని వారికి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement