సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని.. ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు.
ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారు. ఇంకా పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూలైన్‌లో ఓటర్లున్నారని సజ్జల అన్నారు.
‘‘చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారు. టీడీపీ మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు. పేద ప్రజల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తుంది’’ అని సజ్జల చెప్పారు.
‘‘కేంద్ర ప్రభుత్వం అండతో పోలింగ్ డే వరుకూ టీడీపీ నాటకాలు, దాడులు అన్ని చూశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కూడా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశాం’’అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment