సాక్షి, తాడేపల్లి: మంచి జరిగిందంటేనే ఓటేయమని సీఎం జగన్ ధైర్యంగా చెప్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదేళ్లలో ఏం చేశామో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నామన్నారు.
‘‘నాలుగు రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రతిపక్షాలకు అవగాహన లేదు. అభివృద్ధి జరగలేదని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలందిస్తున్నాం. రెండేళ్లు కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మార్పు వాళ్లకు కనిపించడం లేదు. ప్రతి సచివాలయం పరిధిలోనూ రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్ల మేర సంక్షేమం అందింది’’ అని సజ్జల వివరించారు.
‘‘బాబు హయాంలో డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదు.. సున్నా వడ్డీ ఆపేశారు. పేదల కుటుంబాలు బాగుపడేలా సంక్షేమ పథకాలు అందించాం. 16 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందించాం. మహిళలకు రూ.75 వేలతో చేయూత కల్పించాం. పేదలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రభుత్వం అండగా నిలిచింది. మహిళల పేరు మీదే 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం. కియాను మించిన పర్రిశమలు చాలా వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. దేశ జీడీపీలో ఏపీ వాటా 4.82 శాతానికి పెరగడం అభివృద్ధి కాదా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment